
మంచిర్యాల, వెలుగు: అంజనీపుత్ర ఎస్టేట్స్చైర్మన్గుర్రాల శ్రీధర్, డైరెక్టర్పిల్లి రవి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 100 ఫీట్ల రోడ్లో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయకుడు అంగరంగ వైభవంగా పూజలు అందుకుంటున్నాడు. ఆకట్టుకునే సెట్టింగ్స్, డెకరేషన్స్తో పాటు 101 కిలోల లడ్డూతో మంచిర్యాలలోనే స్పెషల్అట్రాక్షన్గా నిలుస్తున్నాడు. వినాయక చవితిని పురస్కరించుకుని కొన్నేండ్లుగా అంజనీపుత్ర ఎస్టేట్స్ఆధ్వర్యంలో నవరాత్రి వేడుకులను ఘనంగా నిర్వహిస్తున్నారు.
ALSO READ : అసైన్డ్ ల్యాండ్స్కు లోన్లు ఎందుకు ఇస్తలేరు
ఈసారి లంబోదరుడికి 101 కిలోల లడ్డూను సమర్పించారు. చివరి రోజు లక్కీ డ్రా తీసి విజేతకు లడ్డూను అందజేసేందుకు ఉచితంగా కూపన్లు పంపిణీ చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఇక్కడి గణేశుడి దర్శనానికి బారులు తీరుతున్నారు. ఈ సందర్భంగా రోజూ వందల మందికి అన్నదానం చేస్తున్నారు. గురువారం జరిగే నిమజ్జనోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు శ్రీధర్, రవి తెలిపారు. మహారాష్ట్ర నుంచి 300 మందితో కూడిన బ్యాండ్టీమ్ను రప్పిస్తున్నామని చెప్పారు.