
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, వర్దన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు పర్యటించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ సభల కోసం వాగులు.. వంకలను పూడ్చుతున్నారని వర్దన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఆరోపించారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాగులను ధ్వంసం చేస్తున్నాడని .. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం వాగులు.. వంకలను పూడ్చి బాటలు వేయడంపై వర్దన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పాడి కౌశిక్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ సభకు వేలాది ట్రిప్పుల మొరం తరలిస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని అధికారులను నిలదీశారు. పెద్దవాగు.. దేవాదుల కెనాళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే నాగరాజు.. కలెక్టర్.. ఆర్డీఓ.. ఏడీ మైన్స్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండేడు క్వారీ ఓనర్ ను బెదిరించి రూ 50 లక్షలు డిమాండ్ చేసిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.