Variety Food: టేస్టీ టేస్టీ వెరైటి భేల్​ పురీ... సూపర్​ ఫుడ్​

Variety Food: టేస్టీ టేస్టీ వెరైటి భేల్​ పురీ... సూపర్​ ఫుడ్​

ఒకప్పటి కంటే ఇప్పుడు ప్రపంచం చిన్నగా మారింది. దూరాలు దగ్గరకాకపోయినా.... వివిధ ప్రాంతాల్లో దొరికే అన్నిరకాల వంటలు అందుబాటులో ఉంటున్నాయి. టూర్​ లు వెళ్లినప్పుడు ... అక్కడ లభించే ఆహార పదార్ధాలు.. చిరుతిండ్లు తింటాం.. తినాలి కూడా.. ఎందుకంటే అక్కడ మనకు కావలసినవి దొరకవు.  అందులో చాలా వెరైటీలు నచ్చుతాయి.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.  అలా నార్త్ లో  బాగా ఫేమస్ అయిన భేల్పురీలు మనకు అలవాటయ్యాయి. అందుకే ఎప్పుడు తినాలంటే అప్పుడు తింటున్నాం. కానీ, ప్రతిసారీ బయటికి వెళ్లాల్సిన పని లేకుండా... ఇలా వివిధ రకాల ఖేల్ స్పెషల్స్ ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. . .

పాప్ కార్న్ తయారీకి కావలసినవి

  • పాప్ కార్న్ (మొక్కజొన్న లేదా జొన్న).. ముప్పావు కప్పు
  •  ఉల్లిగడ్డ తరుగు.. - ఒక టేబుల్ స్పూన్ 
  • చాట్​ మసాలా -.. అర టీ స్పూన్
  •  కారం-..పావు టీ స్పూన్ 
  • నిమ్మరసం.. - రెండు టీ స్పూన్లు 
  • ఉప్పు - .. తగినంత
  •  పచ్చిమిర్చి తరుగు ..- ఒక టీ స్పూన్
  •  కొత్తిమీర తరుగు - ...ఒక టేబుల్ స్పూన్
  •  టొమాటో తరుగు - ..ఒక టేబల్ స్పూన్ 
  • పుదీనా తరుగు ...- ఒక టేబుల్ స్పూన్ (కావాలంటే)

తయారీ విధానం:ఒక పెద్దగిన్నెలో టొమాటో, ఉల్లిగడ్డ, పుదీనా, పచ్చిమిర్చి తరుగు, చాట్ మసాలా, ఉప్పు, కారం కలపాలి. తర్వాత నిమ్మరసం,  కొత్తిమీర తరుగు, పాప్ కార్న్  వేసి కలపాలి. పాప్ కార్న్  పెద్దగా అనిపిస్తే వాటిని కొద్దిగా క్రష్ చేసి వేయొచ్చు. అంతే. పిల్లలు ఇష్టంగా పాప్ కార్న్ భేల్​  రెడీ.

ALSO READ : గుడ్ న్యూస్.. దాల్చిన చెక్క, మిరియాల టీతో.. మీ షుగర్ లెవెల్స్ దెబ్బకు దిగివస్తాయి

పేలాల భేల్ పూరీ తయారీకి కావాల్సినవి

  • బోల్ పేరాలు (ముర్మురాలు..వీటినే బొంగుపేలాలు అంటారు).. - రెండు కప్పులు
  • వేయించిన పల్లీలు .. ఒక టేబుల్​ స్పూన్​
  • పాపడాలు ..ఐదు (కావాలంటే) 
  •  ఉల్లిగడ్డ తరుగు - ...పావు కప్పు
  • టమాటో తరుగు -.. అర కప్పు 
  • ఉడికించిన అలుగడ్డ తరుగు - ...ఒక టేబుల్ స్పూన్ కావాలంటే) 
  • పచ్చిమిర్చి తరుగు -.. ఒక టీ స్పూన్ 
  • కొత్తిమీర తరుగు- ...పావు కప్పు 
  • నిమ్మరసం- ..అర టేబుల్ స్పూన్
  • ఉప్పు- ...తగినంత 
  • కారం- ...పావు టీ స్పూన్
  •  ఇమీ చట్నీ...-రెండు టీ స్పూన్లు
  •  చాట్ మసాలా...-ఒకటి స్పూన్

తయారీ విధానం:  ఒక పెద్ద గిన్నెలో బోటీ పేలాలు, పాపడాలు వేగించిన పల్లీలు వేసి కలపాలి. తర్వాత అలుగడ్డ.. టొమాటో, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, కారం, ఇమ్ చట్నీ, చాటి మసాలా వేయాలి. చివరగా నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. బాంబే ఖేల్ పురీగా దీనికి పేరుంది. కానీ ఇప్పుడు ఇది ముంబైలోనే కాదు...దేశ వ్యాప్తంగా ఫేమస్ అయింది.

సాబుదానా (సగ్గుబియ్యం) భేల్ పూరీ తయారీకి కావాల్సినవి

  • సాబుదానా (సగ్గుబియ్యం) .. ఒక కప్పు
  • కారం- ..పావు టీ స్పూన్
  •  పచ్చిమిర్చి తరుగు.. - అర టీస్పూన్
  • నూనె - .. సరిపడా  
  • ఉప్పు - .. తగినంత 
  • చాట్ మసాలా..- ఒక టీ స్పూన్
  •  గరం మసాలా - ...అర టీ స్పూన్ 
  • ఉడికించిన అలుగడ్డ తరుగు ...- ఒక టేబుల్ స్పూన్  ఉల్లిగడ్డ తరుగు -.. ఒక టేబుల్ స్పూన్ 
  • జీలకర్ర - ..పావు టీ స్పూన్ 
  • కరివేపాకు - ..ఒక రెమ్మ 
  • కొత్తిమీర తరుగు - ..ఒక టేబుల్ స్పూన్
  •  పల్లీలు-..ఒక టేబుల్ స్పూన్

తయారీ విధానం: సాబుదానా(సగ్గుబియ్యం)లను బాగా కడిగి రెండు గంటలు నానబెట్టాలి. తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, అలుగడ్డ, ఉల్లిగడ్డ తరుగు, కరివేపాకు, పల్లీలు వేసి. వేగించాలి. తర్వాత సాబుదానా, కారం, ఉప్పు వేసి ఐదు నిమిషాలు మగ్గించాలి.. చివరగా కొత్తిమీర తరుగు, వాటి మసాలా గరం మసాలా వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవచ్చు.

కార్న్ బూందీ భేల్ పూరీ తయారీకి కావాల్సినవి

  • బూందీ...అరకప్పు 
  • ఉల్లిగడ్డ తరుగు - ..ఒక టేబుల్ స్పూన్
  •  ఉడికించిన స్వీట్ కార్న్... -పావు కప్పు
  • నిమ్మరసం - ...ఒక టేబుల్ స్పూన్
  •  టొమాటో తరుగు... - ఒక టేబుల్ స్పూన్
  • చాట్​ మసాలా -..  అర టీ స్పూన్ 
  • కొత్తిమీర తరుగు... - ఒక టేబుల్ స్పూన్ 
  • ఉప్పు-.. తగినంత

తయారీ విధానం: ఒక పెద్ద గిన్నెలో బూందీ, ఉడికించిన స్వీట్ కార్న్, ఉల్లిగడ్డ తరుగు, టోమాటో తరుగు, చాటి మసాలా, ఉప్పు వేసి కలపాలి... బివరగా  నిమ్మరసం చల్లాలి త్వరగా, సులువుగా తయారయ్యే కార్న్​ బూందీ భేల్​ పురీని నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. 

సేవ్ పురీ భేల్ పూరీ తయారీకి కావాల్సినవి

  • పాపడాలు (చిన్నవి) .. -పన్నెండు.
  • ఉడికించిన అలుగడ్డ తరుగు.. - ఒక కప్పు
  • ఉల్లిగడ్డ తరుగు - ...పావు కప్పు
  •  టొమాటో తరుగు-... పావు కప్పు, 
  • కొత్తిమీర తరుగు - ...ఒక టేబుల్ స్పూన్ 
  • పచ్చిమిర్చి తరుగు ...- ఒక టీ స్పూన్ 
  • కొత్తిమీర చట్నీ...- అర కప్పు 
  • ఇమ్లీ, డేట్స్ చట్నీ-... అర కప్పు 
  • కారం - ...అరటీస్పూన్ 
  • జీలకర్ర పొడి - ...ఒక టీ స్పూన్ 
  • చాట్​ మసాలా... - ఒక టీ స్పూన్ 
  • ఉప్పు -... తగినంత 
  • నిమ్మరసం...- రెండు స్పూన్లు

తయారీ విధానం:  ఒక వెడల్పాటి ప్లేట్​ లో పాపడాలను పరవాలి. వాటిపై ముందు అలుగడ్డ ముక్కలు, తర్వాత ఉల్లిగడ్డ, టొమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు వేయాలి. వాటిపై ఇమ్లీ డేట్స్​ చట్నీ,  కొత్తమీర చట్నీ, రెడ్ చిల్లీ సాస్, కారం. జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఉప్పు వేయాలి. చివరగా  నిమ్మరసం చల్లి సర్వ్​ చేసుకోవాలి. . .