టేస్టీ ఫుడ్​.. సమ్మర్​ ఫుడ్​.. కీరాతో అదిరిపోయే వంటకాలు.. ఇలా ట్రై చేయండి .. పిల్లలు ఇష్టంగా తింటారు

టేస్టీ ఫుడ్​.. సమ్మర్​ ఫుడ్​.. కీరాతో అదిరిపోయే వంటకాలు.. ఇలా ట్రై చేయండి .. పిల్లలు ఇష్టంగా తింటారు

సమ్మర్​ లో  కీరా బండ్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. దాహం తీరుతుందని చాలామంది ఈ కీరా సలాడ్స్​ ను  కొంటుంటారు. ఇంట్లో కూడా కీరాను కేవలం సలాడ్స్ గా మాత్రమే తింటుంటారు. సలాడ్స్​  కూడా ఇష్టంగా తినేవాళ్లు చాలా తక్కువ. నిజానికి ఈ కీరాతో కేవలం సలాడ్సే కాకుండా ఎన్నో వెరైటీ వంటలు చేయొచ్చు. రుచికి రుచి అందిస్తూనే, ఒంటికి చలువ కూడా చేస్తుంది. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం..

కీరా తో ఎగ్ ఫ్రైడ్ రైస్ 
 
సాధారణంగా ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్న తర్వాత చాలామంది అసౌకర్యంగా పిలపుతారు. కొందరికి ఫ్రైడ్ రైస్ తొందరగా అరగదు. అందుకే వాటి జోలికి వెళ్లాలంటే కాస్త ఆలోచిస్తారు. అలాంటప్పుడు కీరాతో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తే  బెటర్​ ఎందుకంటే ఫ్రైడ్​ రౌస్​ తిన్న  ఫీలింగ్ తోపాటు కీరా ఉండడంతో డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. 

కీరా తో ఎగ్ ఫ్రైడ్ రైస్  తయారీకి కావలసినవి 

 

  • అన్నం: రెండు కప్పులు 
  • కీరా తురుము: ఒక కప్పు 
  • గుడ్లు: రెండు, 
  • ఉప్పు తగినంత 
  • కారం: టీస్పూన్,
  •  ఉల్లిగడ్డ :ఒకటి 
  • పచ్చిమిర్చి: నాలుగు
  •  సోయాసాస్ : టీస్పూన్ 
  • బిల్లీసాస్ :టీస్పూన్ 
  • మిరియాలపొడి: టీస్పూన్ 
  • కొత్తిమీర తురుము: 2 టేబుల్ స్పూను. 
  • అల్లంవెల్లుల్లి:2 టీస్పూన్లు 


తయారీ విధానం:  ముందు ఒక గిన్నెలో గుడ్లను పగల గొట్టి బాగా గ్రైండ్ చేయాలి. అందులో ఉప్పు, కారం, మిరియాలపొడి వేసి అమ్లెట్​ వేయాలి. కీరా తొక్కు తీసి సన్నగా తురిమి పక్కకు పెట్టాలి. కళాయిలో నూనె కాగాక ఉల్లి తరుగు, పచ్చిమిర్చి వేసి వేగించాలి. తరువాత సోయా సాస్, చిల్లీసాస్ వేసి కలిపి ఓ నిమిషం ఉంచాలి. తర్వాత తరిగిన కీరా తురుము కూడా వేసి ఓ నిమిషం వేగాక అన్నం వేసి బాగా కలపాలి అమ్లెట్ , చిన్న ముక్కలుగా చేసి వాటిని కూడా అన్నంలో వేసి మరోసారి కలపాలి. రెండు నిమిషాలు స్టౌమీదే ఉంచి, దించే ముందు కొత్తిమీర చల్లితే చాలు కీదా ఎగ్ ఫ్రైడ్ రైస్  రెడీ..

కీరాతో బజ్జీ తయారీ 

బజ్జి అనగానే మిరపకాయలు లేదంటే ఆలుగడ్డ లతో వేసేవే గుర్తొస్తాయి. కానీ కీరాతో కూడా టేస్టీ బజ్జీలు చేసుకోవచ్చు. పైగా ఇవి తింటుంటే అంత ఆయిలీగా అనిపించవు. లైట్ ఫుడ్ తిన్న ఫీలింగ్   కలుగుతుంది

కీరా బజ్జీ తయారీకి కావలసినవి.. 

  • మైదాపిండి లేదా శెనగపిండి: ఒక కప్పు 
  • రాక్​సాల్ట్: తగినంత 
  • కారం: అరటీస్పూన్ 
  • ధనియాలపొడి:  అరటీస్పూన్ 
  • పచ్చిమిర్చి తురుము: రెండు టేబుల్​ స్పూన్స్
  • కీరాలు : రెండు 
  • నూనె: వేగించడానికి సరిపడా

తయారీ విధానం: కీరాలను ముందుగానే కట్ చేయాలి. (చిన్నచిన్న ముక్కలుగా కట్ చేస్తే పకోడీల్లా కూడా వేసుకోవచ్చు)  ఓ గిన్నెలో మైదా/శెనగపిండి వేసి అందులో ఉప్పు, ధనియాలపొడి, కారం, పచ్చిమిర్చి వేసి కావలసినన్ని నీళ్లు పోసి కాస్త జారుగా కలపాలి. బాణలిలో నూనె పోసి కాగాక సిమ్​ లో పెట్టి, పిండి మిశ్రమంలో కీరా ముక్కలు ముంచి వేయాలి. ఒకవేళ కీరా ముక్కలు చిన్నగా ఉంటే పకోడీల్లా కూడా వేసుకోవచ్చు. వీటిని ఏ చట్నీతో తిన్నారుచిగా ఉంటాయి

కీరాతో చీజ్​ కేక్​ 

కేక్ పేరు చెప్పగానే ఎక్కడున్నా పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. అయితే ఇంక్ ఫుడ్ అనే కారణంతో పిల్లలను కేక్​కు దూరం పెడుతుంటాం.. అలాంటప్పుడు కీరా చీజ్ కేక్ చేసిస్తే బెటర్. మిగతా రేకలతో పోలిస్తే ఇది  చాలా లైట్​ ఫుడ్​..

కీరాతో చీజ్​ కేక్​  తయారీకి కావలసినవి 

  • సాల్ట్ బిస్కెట్స్​:  200గా 
  • వెన్న: 50 గ్రా, 
  • కీరా: ఒకటి 
  • నిమ్మకాయ తొక్క పొడి: టీస్పూన్ 
  • మిరియాలపొడి: టీస్పూన్ 
  • చీజ్ తురుము: 50 గ్రా 
  • నీళ్లు లేకుండా వడకట్టిన పెరుగు : పావులీటరు
  •  క్రీమ్ : కప్పు 
  •  చక్కెర:  ఒకటిన్నర టేబుల్ స్పూన్
  •  నిమ్మరసం: 2 టేబుల్ స్పూన్స్ 
  • జెలాటిన్: 2 టీస్పూన్స్ 
  • పుదీనా తురుము: 2 టీస్పూన్స్ 


తయారీ విధానం: లేక కీరాలను తీసుకొని తొక్కదీసి, సన్నగా తురమాలి. సాల్ట్​ బిస్కెట్లను పొడిచేసి అందులో వెన్న, నిమ్మతొక్క వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వెడల్పాటి  గిన్నెలో వేసి సమంగా చేయాలి. మరో గిన్నెలో తురుము, పెరుగువేసి బాగా బ్లెండ్ చేయాలి. అందులోనే చక్కెర.. జెలాటిన్ పుదీనా, క్రీమ్ వేసి మరోసారి బ్లెండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతకు ముందు సిద్ధంగా ఉంచుకున్న మిశ్రమంపై పోయాలి. దీన్ని ఫ్రిజ్​లో దాదాపు ఎనిమిది గంటలపాటు ఉంచి, బయటకు తీసి కూల్ గా ఉన్నప్పుడే సర్వ్ చేయాలి


కీరా నూడుల్స్​ సలాడ్​ 

నూడుల్స్​ ను  పిల్లలు కూడా ఇష్టంగా ఉంటారు. కీరాను తినమంటే అంతగా ఇష్టపడరు. అటువంటప్పుడు కీరా  నూడుల్స్​ సలాడ్​ ట్రై చేయవచ్చు.

 నూడుల్స్​ సలాడ్​ తయారీకి కావలసినవి 

  • నూడుల్స్​: ఒక కప్పు
  • కీరాలు: రెండు, 
  • ఉప్పు, తగినంత 
  • నిమ్మరసం: 2 టీస్పూన్లు 
  • మిరియాలపొడి: ఒక టీస్పూన్ 
  • చీజ్ తురుము: టేబుల్ స్పూన్ 


తయారీ విధానం:  సూడుల్స్ ను ఉడికించి, నీళ్లు వంపేసి.. చల్లటి నీళ్లతో మరోసారి కడిగి పక్కన పెట్టాలి. కీరా తొక్కతీసి, సన్నగా తురమాలి. ఈ తురుమును నూడుల్స్ లో వేసి బాగా కలపాలి. ఉప్పు, మిరియా లపొడి చల్లి, చివరగా చీజ్ ను తురమాలి. సర్వ్​ చేసేటప్పుడు కొంచెం నిమ్మరసం పిండి సలాడ్స్ లా తింటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. 

–వెలుగు, లైఫ్​–