Summer Fruits : కర్బూజతో మిల్క్ షేక్, రసగుల్లా, కస్టర్డ్.. ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి..

Summer Fruits : కర్బూజతో మిల్క్ షేక్, రసగుల్లా, కస్టర్డ్.. ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి..

వేసవిలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది. అలాంటి ఫ్రూట్స్ లో కర్బూజ ముందుంటుంది. వేసవిలో శరీరం కోల్పోయిన నీటిని తిరిగి అందించడంలో ఈ ఫ్రూట్ బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యంతో పాటు అందానికి కూడా చాలా హెల్ప్ చేస్తాయి. ఇన్ని ప్రయోజనాలున్న ఈ పండుతో స్వీట్స్ చేసుకుని తింటే బాగుంటుంది. 

కర్భూజా కస్టర్డ్​ తయారీకి కావాల్సినవి

  • కర్బూజ ముక్కలు - ఒక కప్పు
  • పాలు- అర లీటరు 
  • పంచదార- పావు కప్పు
  • కస్టర్డ్ పౌడర్- రెండు టేబుల్ స్పూన్లు
  • వెనిల్లా ఎసెన్స్- నాలుగు చుక్కలు
  • బాదం పలుకులు- ఒక టీస్పూన్
  • దానిమ్మ గింజలు - ఒక టీ స్పూన్

 తయారీ విధానం:  పాన్​ లో పాలు పోసి, చక్కెర వేసి సన్నని మంటపై మరిగించాలి. ఒక గిన్నెలో కస్టర్డ్ పౌడర్ వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో వేసి బాగా కలిపి స్టవ్ ఆపాలి. కొద్దిసేపు చల్లార్చి వెనిల్లా ఎసెన్స్, కర్బూజ ముక్కలు వేసి కలిపి దానిమ్మ గింజలు, బాదం పలుకులతో గార్నిష్ -చేయాలి. 

కర్భూజాతో మిల్క్​షేక్​ తయారీకి కావాల్సినవి: 

  • కర్బూజ ముక్కలు-రెండు కప్పులు
  • పాలు (మరిగించి, చల్లార్చి)- అర లీటరు
  •  చక్కెర - అర కప్పు
  • ఐస్ క్యూబ్స్- తగినన్ని
  •  బాదం పలుకులు-  సరిపడ

తయారీ విధానం: మిక్సీజార్ లో కర్బూజ ముక్కలు, చక్కెర వేసి మిక్సీ పట్టాలి. అందులో పాలు, ఐస్ క్యూబ్స్ వేసి ఇంకోసారి మిక్సీ పట్టాలి. ఆపై ఆ మిశ్రమాన్ని సర్వింగ్ గ్లాసులో పోయాలి. పైన బాదాం పలుకులతో గార్నిష్ చేస్తే చల్లచల్లని మిల్క్ షేక్ తాగడానికి రెడీ. 

కర్భూజాతో రసగుల్లా తయారీకి కావాల్సినవి: 

కర్బూజ ముక్కలు - ఒక కప్పు
 చక్కెర - ఒక కప్పు 
పచ్చికోవా- ఒక కప్పు 
మైదా- రెండు టేబుల్ స్పూన్లు 
ఇలాచీ పొడి - అర టీ స్పూన్
 నెయ్యి- ఒక టేబుల్ స్పూన్ 

తయారీ విధానం: పాన్ లో  కర్బూజ ముక్కలు వేసి ఉడికించాలి (కర్బూజలో నీరు ఉంటుంది కాబట్టి నీళ్లు పోయాల్సిన అవసరం లేదు). తర్వాత అందులో పచ్చికోవా వేసి బాగా కలిపి దగ్గర పడే వరకు ఉడికించాలి. తరువాత మైదా పిండి వేసి బాగా కలిసే వరకు గరిటెతో కలిపి స్టవ్ ఆపాలి. ఆ మిశ్రమాన్ని చల్లార్చాలి. మరొక పాన్లో తగినన్ని నీళ్లు పోసి చక్కెర వేసి పాకం రెడీ చేయాలి. అందులో ఇలాచీ పొడి వేసి బాగా కలపాలి. కర్బూజ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని నెయ్యి అద్దుతూ ఉండలు చెయ్యాలి. ఆ ఉండల్ని పంచదార పాకంలో వేసి కాసేపు ఉడికిస్తే యమ్మీయమ్మీ కర్బూజ రసగుల్లా రెడీ

-–వెలుగు, లైఫ్​–