ఈకో ఫ్రెండ్లీ వెడ్డింగ్ కార్డు డిజైన్ చేయించిన పర్యావరణ ప్రేమికుడు
వెడ్డింగ్ కార్డ్స్ డిఫరెంట్‌గా ఉండాలని కొత్త కొత్త డిజైన్స్ చేయించుకుంటున్నారు చాలామంది. శశికాంత్ అనే ఈయన ఎన్విరాన్మెంట్ను దృష్టిలో పెట్టుకుని తన పెళ్లికి స్పెషల్ వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చేయించుకున్నాడు. ఈ కార్డ్ స్పెషాలిటీ ఏంటంటే.. దాన్ని నీళ్లలో తడిపి, మట్టిలో పెడితే.. అందులో ఉన్న పూలు, కూరగాయల విత్తనాలు మొలకెత్తుతాయి.
వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డును ఎవరైనా వాళ్ల స్థాయికి తగ్గట్టు ప్రింట్ చేయిస్తుంటారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కి చెందిన శశికాంత్ కొర్రవత్ మాత్రం ఎన్విరాన్మెంట్కి మేలు చేసే వెడ్డింగ్ కార్డ్స్ పంచుతున్నాడు. శశికాంత్ ఇండియన్ రైల్వేస్ ట్రాఫిక్ సర్వీసు ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. ఆగ్రాలోని ఓ స్టార్టప్ కంపెనీ ఈ విత్తనాల వెడ్డింగ్ కార్డును తయారుచేసింది. ‘నా జీవితంలో ముఖ్యమైన రోజున పర్యావరణానికి కొంత మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్డ్స్ తయారు చేయించా’ అన్నాడాయన. ఈ వెడ్డింగ్ కార్డ్స్‌లో బెండ, టొమాటో, పచ్చిమిర్చిలతోపాటు చామంతి, బంతి, లిల్లీ సీడ్స్ ఉన్నాయి.
దీన్ని నీళ్లలో నానబెట్టి మట్టిలో పడేస్తే విత్తనాలు మొలకెత్తుతాయి. ఈ నెల 28న శశికాంత్ పెళ్లి. ఈ ఎకో ఫ్రెండ్లీ కార్డ్‌ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కు కూడా ఇచ్చి ఇన్వైట్ చేశాడు. ఆ కార్డును చూసిన సజ్జనార్ శశికాంత్‌ను అభినందించారు. ::: షాద్‌నగర్, వెలుగు
Read More News….