డిప్లొమా, డిగ్రీ అర్హతతో బెల్ లో సీనియర్ ఇంజనీర్లు, ఎస్​బీఐలో మేనేజర్ ఉద్యోగాలు..

డిప్లొమా, డిగ్రీ అర్హతతో బెల్ లో సీనియర్ ఇంజనీర్లు, ఎస్​బీఐలో మేనేజర్ ఉద్యోగాలు..

ఎంఓఐఎల్​లో ఉద్యోగాలు 

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నాగ్​పూర్​లోని మాంగనీస్​ ఓర్​ ఇండియా లిమిటెడ్​(ఎంఓఐఎల్) నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

పోస్టుల సంఖ్య 75: వైండింగ్​ ఇంజిన్​ డ్రైవర్ –2: 24, మైన్ మేట్​ గ్రేడ్​–1: 20, బ్లాస్టర్ గ్రేడ్​–2: 14, మైన్​ ఫోర్​మెన్​–1: 12, సెలెక్ట్​ గ్రేడ్​మైన్​ 
ఫోర్​మెన్​: 5.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదోతరగతి, డిప్లొమా, బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 
అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా. జనరల్,  ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​అభ్యర్థులకు రూ.295, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. లాస్ట్​ డేట్​ మార్చి 25. 
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ట్రేడ్​ టెస్ట్​ ఆధారంగా.

బెల్​లో సీనియర్ ఇంజినీర్లు 

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టు భర్తీకి బెంగళూరులోని భారత్​ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్​ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులను పర్మినెంట్/ ఫిక్స్ డ్​ టర్మ్ ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు మార్చి 26 నుంచి ఆఫ్​లైన్​ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు .
 

పోస్టుల సంఖ్య 15: సీనియర్ ఇంజినీర్ 13, డిప్యూటీ ఇంజినీర్ 2. 
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్​ డిగ్రీ, బీఆర్క్​ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 
అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా. డిప్యూటీ జనరల్​ మేనేజర్, భారత్​ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్​, జళహల్లి పోస్టు, బెంగళూరు చిరునామా పంపించాలి. 
లాస్ట్ డేట్:​ మార్చి 26. 
సెలెక్షన్​ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. 

ఎస్​బీఐలో మేనేజర్లు

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి స్టేట్​బ్యాంక్ ఆఫ్ ఇండియా, ముంబయి అప్లికేషన్లను కోరుతున్నది. అర్హత గల అభ్యర్థులు మార్చి 26వ తేదీలోగా ఆన్ లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
 

పోస్టులు: మేనేజర్​(రీటైల్​ ప్రోడక్ట్స్) 04

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ, పీజీడీఎం, పీజీపీఎం, ఎంఎంఎస్ లో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి 2024, డిసెంబర్ 31 నాటికి 28 నుంచి 40 ఏండ్లు ఉండాలి.
అప్లికేషన్ ప్రాసెస్: ఆన్​లైన్ ద్వారా
లాస్ట్​డేట్: మార్చి 26. 
సెలెక్షన్​ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా