తొర్రూరు, వెలుగు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణానికి చెందిన పలు పార్టీల నాయకులు మంగళవారం పాలకుర్తిలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి అనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు పార్టీలో చేరుతున్నారని తెలిపారు.
తొర్రూరు పట్టణానికి చెందిన బీఎస్పీ వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి పంజా కల్పన, తొర్రూరు మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యుడు మహమ్మద్ జలీల్, బీఆర్ఎస్ 8వ వార్డు అధ్యక్షుడు, మాజీ వార్డు సభ్యుడు కిన్నెర పాండు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ అల్లం అర్జున్ రాజ్, బీఆర్ఎస్ నాయకులు కొండపల్లి వెంకటాచలం చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు హనుమాండ్ల తిరుపతిరెడ్డి, తొర్రూరు పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హమ్యా నాయక్, నాయకులున్నారు.