మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీల్లోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఒకే రోజు పలువురు నాయకులు బీజేపీ, కాంగ్రెస్ లను వీడి టీఆర్ఎస్ లో చేరారు. ఇందులో పలు గ్రామాలకు చెందిన సర్పంచ్ లు, సీనియర్ లీడర్లు ఉన్నారు. వీరిలో చండూరు మండలం కస్థాల గ్రామ సర్పంచ్ మెండి ద్రౌపతమ్మ వెంకట్ రెడ్డి, నేర్మేట గ్రామ సర్పంచ్ నంది కొండ నర్సిరెడ్డి, గుండ్ర పల్లి సర్పంచ్ తీగల సుభాష్ , దోని పాముల సర్పంచ్ తిప్పర్తి దేవేందర్, తుమ్మల పల్లి గ్రామ సర్పంచ్ కూరపాటి లక్ష్మి సైదులు, మునుగోడు మండలం కోతులారం సర్పంచ్, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షురాలు జాజుల పారిజాత సత్యనారయణ గౌడ్ దంపతులు ఉన్నారు.
వారితోపాటు మునుగోడు మండలం కిష్టాపురంకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు మానుకుంట్ల కుమార స్వామి గౌడ్, పంతగి లింగస్వామి గౌడ్, సురుగి లింగ స్వామి గౌడ్, సురిగి రాజు సురిగి వెంకన్న, జాజుల శ్రీశైలంలు మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి మంత్రి పార్టీలోకి స్వాగతం పలికారు.