నర్సాపూర్ ఫారెస్ట్ పార్కులో ట్రెక్కింగ్

నర్సాపూర్ ఫారెస్ట్ పార్కులో ట్రెక్కింగ్

మెదక్, నర్సాపూర్​, వెలుగు: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా బుధవారం ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. డీఎఫ్​వో జోజి ఆధ్వర్యంలో నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కులో బీవీఆర్‌ఐటీ ఇంజీరింగ్ కాలేజీ ఎన్‌ఎస్‌ఎస్ స్టూడెంట్స్​, అక్షర స్కూల్​స్టూడెంట్స్​ కలిసి సైక్లింగ్, ట్రెక్కింగ్ నిర్వహించారు. నర్సాపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అరవింద్ అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, మంటల నివారణ  ప్రాముఖ్యత గురించి వివరించారు. 

మెదక్ జిల్లా సరిహద్దులోని పోచారం వన్యప్రాణి అభయారణ్యంలో వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించారు. హవేలీ ఘన్​పూర్​ మండలం బూర్గుపల్లి జడ్పీ హైస్కూల్​ స్టూడెంట్స్​కు వ్యాసరచన, పక్షుల పరిశీలన, వనదర్శిని, డిజిటల్ ఆవిష్కరణల గురించి వివరించారు. కార్యక్రమంలో మెదక్​ఎఫ్ఆర్ వో మనోజ్ కుమార్, ఎఫ్ ఎస్ వో స్రవంతి, బీట్ ఆఫీసర్లు రాము, ప్రియాంక, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.