హైదరాబాద్, వెలుగు: రైడ్-హెయిలింగ్ యాప్ వోల్టా ఈవీ స్కూటర్ తయారీ సంస్థ వార్కస్ తో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. రెండు సంస్థలు కలసి వచ్చే ఐదేళ్లలో వోల్టా ఫ్లీట్లోకి లక్ష ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెట్టనున్నాయి. ఈ సందర్భంగా వోల్టా సీఈఓ రాజా విక్రమ్ మాట్లాడుతూ తమ పర్యావరణ అనుకూల వెహికల్స్ పార్సిల్ సేవలకు కూడా ఉపయోగ పడతాయని వెల్లడించారు.
వార్కస్ ఫౌండర్ రామ్ వేమిరెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మారుస్తామని చెప్పారు. తక్కువ చార్జీలు, డిజిటల్ మీటర్లు, డ్రైవర్లకు జీరో కమీషన్, ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ ఫీచర్లు తమ ప్రత్యేకతలు అని వివరించారు.