వర్మ సెటైర్ అదుర్స్..’కమ్మరాజ్యంలో కడప రెడ్లు’పాట రిలీజ్

వర్మ సెటైర్ అదుర్స్..’కమ్మరాజ్యంలో కడప రెడ్లు’పాట రిలీజ్

పొలిటికల్ సిస్టమ్ పై వర్మ సెటైర్

రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న సినిమా ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’. ఈ మూవీలోని మొదటిపాట, టైటిల్ సాంగ్ ను ఆయన సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే వర్తమాన పరిస్థితులే ఈ సినిమాలో చూపిస్తున్నామని చెప్పారు రామ్ గోపాల్ వర్మ. ఇది వివాదం లేని సినిమా అని.. ఐనప్పటికీ.. సినిమాలో అన్నీ వివాదాస్పద పాత్రలే ఉంటాయన్నారు.

పార్టీలు .. పార్టీల నాయకులు ప్రత్యర్థులపై తమ పగ తీర్చుకోవడానికి ప్రభుత్వాన్ని ఎలా వాడుకుంటారన్న అంశాన్ని తన సినిమాలో చూపించబోతున్నామని సాంగ్ ట్రైలర్ తో చెప్పారు వర్మ. ప్రస్తుతం ఉన్న పొలిటికల్ సిస్టమ్ పై ఈ పాట సెటైరికల్ గా అనిపిస్తుంది. “కత్తులు లేవిప్పుడు..చిందే నెత్తురు లేదిప్పుడు.. యుద్ధం చేసే పద్ధతి మొత్తం మారిందీ ఇప్పుడు… కొత్త యుద్ధం.. ఇది కొత్త యుద్ధం” అంటూ సాగే పాట అదుర్స్ అనిపిస్తోంది. “మాధ్యమమే దళము.. నడిచే చట్టమె ఆయుధము.. పరువు,  ప్రాణాలు తోడేసే రణము.. కొత్త యుద్ధం… ఓటు వేసేవరకే పౌరుడు రాజు.. ఎలక్షన్ల వరకే ప్రజాస్వామ్యం” అనే లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య వాదోపవాదాలు, పంచ్ డైలాగులను సాంగ్ లో వినిపించారు.