నల్గొండ అర్బన్, వెలుగు: బీజేపీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు కచ్చితంగా గుర్తింపు ఉంటుందని బీజేపీ జిల్లా ఇన్‌చార్జి ప్రదీప్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు చెప్పారు. బీజేపీ నల్గొండ కొత్త అధ్యక్షుడు డాక్టర్నాగం వర్షిత్‌రెడ్డి ఆదివారం పార్టీ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారు వర్షిత్‌కు విషెస్ చెప్పారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పార్టీ తరఫున అన్ని విధాలుగా సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అత్యధిక ఎంపీలు గెలువబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటి అమలులో చిత్తశుద్ధి చూపడం లేదని ఆరోపించారు. నాగం వర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి థాంక్స్ చెప్పారు. అందరిని కలుపుకొకి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మాధగాని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహ రెడ్డి, మాజీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి, గోలి మధుసూదన్ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి పోతేపాక సాంబయ్య పాల్గొన్నారు.