ఆధ్యాత్మికం: సహస్రగోదాన ఫలితం.. వరూధిని ఏకాదశి.. ఎప్పుడు.. ఆరోజు ఏం చేయాలి.

ఆధ్యాత్మికం:  సహస్రగోదాన ఫలితం.. వరూధిని ఏకాదశి.. ఎప్పుడు.. ఆరోజు ఏం చేయాలి.

హిందువులకు  ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.  ఏకాదశి తిథి ప్రతి ఏడాది 24 సార్లు వస్తుంది. ప్రతి నెలా శుక్ల పక్షంలో ఒకసారి, క్రిష్ణ పక్షంలో మరోసారి వస్తుంది. అయితే చైత్రమాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని వరూధిని ఏకాదశి అంటారు.  ఈ ఏడాది (2025)ఏప్రిల్ 24న వచ్చింది. ఆ రోజున  ఉపవాసం ఉండి.. ఏకాదశి నియమాలు పాటిస్తే సహస్ర గోవులను దానం చేసిన ఫలితం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి.. 

చైత్ర మాసంలోని కృష్ణ పక్షంలోని ఏకాదశి తిథి రోజుని వరూథిని ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి.. ఈ రోజున శ్రీ మహా విష్ణువు, లక్ష్మీ దేవిని అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు. అయితే విష్ణు పూజ సమయంలో తులసి దళాలకు సంబంధించిన కొన్ని సాధారణ చర్యలు తీసుకోవడం ద్వారా.. ఎప్పటి నుంచో పెండింగ్ పనులన్నీ పూర్తి అవుతాయని నమ్ముతారు. నిర్మలమైన హృదయంతో పూజించే భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ రోజున తులసి దళాలకు సంబంధించిన కొన్ని పరిహరాలను చేయడం ద్వారా, కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు, సానుకూలత వస్తాయి.

వరూధుని ఏకాదశి  ముహూర్తం 

  •  ఏప్రిల్ 23న సాయంత్రం  ఏకాదశి తిథి సాయంత్రం 4:43 గంటలకు ప్రారంభం
  • ఏప్రిల్ 24న మధ్యాహ్నం 2:32 గంటల వరకు ఏకాదశి తిథి 
  •  ఉదయ తేదీ ప్రకారం ఏప్రిల్ 24న వరూధుని ఏకాదశి ఉపవాసం పాటిస్తారు.

వరూథిని ఏకాదశి రోజు (ఏప్రిల్​ 24) పాటించాల్సిన నియమాలు

  • పురాణాల ప్రకారం ఏకాదశి తిథి రోజున ఉపవాసం ఉండాలి.  వరూధిని ఏకాదశి ( ఏప్రిల్​ 24) ఉపవాస దీక్షను పాటిస్తే సహస్ర గోవులను దానం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో అలాంటి ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.
  • దశమి తిథి రోజున సూర్యాస్తమయానికి ముందు భోజనం చేసి, రాత్రి బ్రహ్మచర్యం పాటించాలి. 
  • ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి, ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయండి.
  • విష్ణువును పూజించండి. పండ్లు, పువ్వులు, ధూపం, దీపాలు మొదలైనవి సమర్పించండి.
  • వరూధిని ఏకాదశి ( ఏప్రిల్​ 24) రోజంతా ఉపవాసం ఉండండి .. పాలు తీసుకోవచ్చు..  పండ్లు మాత్రమే తినండి. ఈ ఏకాదశి రోజు తృణధాన్యాలను తినకూడదు. 
  • వరూధిని ఏకాదశి రోజున పేదలకు కావలలసిన వస్తువులకు మీశక్తి మేరకు దానం చేయండి.
  • రాత్రిపూట జాగారం చేయాలి.  విష్ణువును స్తుతిస్తూ కీర్తనలు పాడండి.
  • ద్వాదశి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత, బ్రాహ్మణులకు స్వయంపాకం ఇచ్చి ఆ తరువాత  ఉపవాస దీక్షను విరమించండి


వరూథిని ఏకాదశి రోజున ఉదయం నిద్రలేచి స్నానాదులు ముగించుకోని,దేవుడికి ప్రత్యేకంగాపూజలు చేయాలి, విష్ణుదేవుడికి ప్రత్యేకంగా ఈరోజు పచ్చని .. ఎర్రని  పూలు సమర్పించాలి. ఆయన అలంకార ప్రియుడు కాబట్టి ఆయనకు భక్తితో అనేక రకాల పూలను పూజలలో ఉపయోగించాలి. ఏకాదశి రోజున అందుబాటులో ఉన్న ఫలాలను నైవేద్యంగా సమర్పించాలి.  ఆ రోజున ( ఏప్రిల్ 24)  ముఖ్యంగా పెళ్లి కానీ వారు, ఆర్థికసమస్యలతో సతతతమయ్యేవారు కొన్ని పరిహారాలు పాటించాలంటూ కూడా పండితులు చెబుతున్నారు. అందుకు ఎన్ని సంబంధాలుచూసిన పెళ్లి కుదరని వారు ఈరోజు రుక్మిణి, క్రిష్ణుడి వివాహావిధానం చదవాలి. అంతేకాకుండా సత్యనారాయణ పూజ వ్రతకథ చదివిన కూడా మంచి ఫలితం కల్గుతుంది.  

తులసి దళంతో ఏకాదశి పరిహారాలు

ఏకాదశి రోజున తులసి మొక్కను ఇంటికి తీసుకురావడం లేదా తులసి మొక్కను నాటడం శుభప్రదంగా భావిస్తారు. కనుక వరూధుని ఏకాదశి రోజున తులసి మొక్కను నాటాలి. దీంతో జీవితంలో కలుగుతున్న సమస్యలు క్రమంగా ముగింపునకు రావడం మొదలవుతుంది. అదే సమయంలో ఇంటికి ఈశాన్య దిశలో తులసి మొక్కను నాటండి.

వరూధుని ఏకాదశి రోజున, బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానం చేయండి. తులసి మొక్కకు నీరు పెట్టండి. తరువాత దాని ముందు నెయ్యి దీపం వెలిగించండి. తులసికి సంబంధించిన మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. దీనితో పాటు పెండింగ్ పనులు కూడా పూర్తి అవుతాయని పండితులు చెబుతున్నారు. 

వరూధునిఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకి సమర్పించే నైవేద్యంలో తులసి దళాలను ఉపయోగించాలని నిర్ధారించుకోండి. ఇలా వరూధుని ఏకాదశి రోజున చేసే పూజలు, పరిహరాలతో వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే జీవితంలో ఎటువంటి అడ్డంకులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.