రివ్యూః వ‌రుడు కావ‌లెను

రివ్యూః వ‌రుడు కావ‌లెను
  • రివ్యూః వ‌రుడు కావ‌లెను
  • ర‌న్ టైమ్ - 2 గంట‌ల 20 నిమిషాలు
  • న‌టీన‌టులుః నాగ‌శౌర్య‌,రీతూవ‌ర్మ‌,న‌దియా,ముర‌ళీ శ‌ర్మ‌,జ‌య ప్ర‌కాష్‌,ప్ర‌వీణ్,స‌ప్త‌గిరి,హ‌ర్ష‌వ‌ర్థ‌న్ త‌దిత‌రులు
  • సినిమాటోగ్ర‌ఫీః సాయిరామ్
  • మ్యూజిక్ -విశాల్ చంద్ర‌శేఖ‌ర్
  • ర‌చ‌న‌-గ‌ణేష్ రావూరి
  • నిర్మాత‌-నాగ వంశీ
  • క‌థ‌,ద‌ర్శ‌కత్వం-ల‌క్ష్మీ సౌజ‌న్య‌
  • రిలీజ్ డేట్ః అక్టోబ‌ర్ 29,2021

క‌థేంటి?
రీతూ (భూమి) కి పెళ్లంటే ఇష్టం ఉండ‌దు. కానీ వాళ్ల అమ్మ (న‌దియా) త‌న‌ను పెళ్లి చేసుకోవాలంటూ ప్రెష‌ర్ పెడుతుంది. మ‌రోవైపు ఇండియాను చూడాలంటూ ఫారెన్ నుండి దిగుతాడు ఆకాష్ (నాగశౌర్య‌) త‌న కంపెనీలోనే ఆర్కిటెక్చ‌ర్ గా ఓ ప్రాజెక్ట్ కోసం చేరి త‌న‌కు దగ్గ‌ర‌వుతాడు. వీళిద్ద‌రికి కాలేజ్ లోనే ప‌రిచ‌యం ఉంటుంది. సీరియ‌స్ గా ఉండే ఆమెను త‌న‌ను ఇష్ట‌పడేలా చేసుకుంటాడు. కానీ ఆ అమ్మాయి స‌డ‌న్ గా నో చెప్తుంది. మ‌ధ్య‌లో ఏం జ‌ర‌గింది. కాలేజ్ లో ఉన్న‌ప్పుడు ఏం జ‌రిగింది. అనేది మిగ‌తా స్టోరీ.

న‌టీన‌టుల ప‌ర్ఫార్మెన్స్-
నాగ‌శౌర్య మంచి న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. త‌న‌కు ఇలాంటి సింపుల్ ల‌వ‌ర్ బాయ్ రోల్స్ బాగుంటాయి. రీతూ వ‌ర్మ‌కు మంచి క్యారెక్ట‌ర్ ద‌క్కింది. ఆ పాత్ర‌కు న్యాయం చేసింది. న‌దియా మరోసారి మ్యెచ్యూర్డ్ ప‌ర్ఫార్మెన్స్ తో మెప్పించింది. ముర‌ళీ శ‌ర్మ‌ను ఇంకాస్త వాడుకోవాల్సింది. స‌ప్త‌గిరి, ప‌మ్మి సెకండాఫ్ లో న‌వ్వించారు.ఫ్రెండ్ క్యారెక్ట‌ర్ లో ప్ర‌వీణ్ బాగున్నాడు. హ‌ర్ష‌వ‌ర్థ‌న్ కు విల‌న్ రోల్ సూట్ అవ్వ‌లేదు. 
టెక్నిక‌ల్ వ‌ర్క్ః
ప‌చ్చిపులుసు వంశీ కెమెరా ప‌నిత‌నం చాలా బాగుంది. అంద‌మైన లొకేష‌న్లు చూపించాడు. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ మ్యూజిక్ బాగుంది. పాట‌లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండు ఆక‌ట్టుకున్నాయి. ఎడిటింగ్ ఫ‌ర్వాలేదు. ఆర్ట్ వ‌ర్క్, ప్రొడ‌క్ష‌న్ వాల్యూయ్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇక గ‌ణేశ్ రావూరి డైలాగులు సినిమాకు హైలైట్ గా నిలిచాయి.
విశ్లేష‌ణః
వ‌రుడు కావలెను నీట్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్. చిన్న స్టోరీ లైన్ తో సాగే సినిమా. హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుంది. లేడీ డైరెక్ట‌ర్ ల‌క్ష్మీ సౌజ‌న్య తొలిసారి అయిన బాగానే హ్యాండిల్ చేసింది. నెమ్మ‌దిగా మొద‌లైన‌ప్ప‌టికీ సెకండాఫ్ లో కామెడీ, డైలాగుల వ‌ల్ల ఒవ‌రాల్ గా పాస్ అయిపోతుంది. ఇక సినిమాకు న‌టీన‌టుల ప‌ర్ఫార్మెన్స్, డైలాగులు ప్రాణం పోసాయి. అలాగే మ్యూజిక్, సినిమాటోగ్ర‌ఫీ కూడా ప్ల‌స్ అయ్యాయి. అయితే చిన్న క‌థ కావ‌డం, హీరోహీరోయిన్ల మ‌ద్య కాన్ ఫ్లిక్ట్ బలంగా లేక‌పోవ‌డం మైన‌స్. కానీ సెకండాఫ్ కామెడీ, డైలాగుల వ‌ల్ల ఓకే అయింది. ఓవ‌రాల్ గా ఓసారి చూడ‌వ‌చ్చు.
బాట‌మ్ లైన్-వ‌రుడు బాగున్నాడు