Varun Aaron: అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా ఫాస్ట్ బౌలర్ రిటైర్మెంట్

భారత పేసర్ వరుణ్ ఆరోన్ అంతర్జాతీయ క్రికెట్ ను రిటైర్మెంట్ ప్రకటించాడు. 35 ఏళ్ల ఆరోన్ శుక్రవారం (జనవరి 10) సోషల్ మీడియా వేదికగా రిటైర్మెంట్ అవుతున్నట్టు తన నిర్ణయాన్ని తెలిపాడు. "గత 20 సంవత్సరాలుగా క్రికెట్ ఆడినందుకు సంతోషంగా ఉంది. దేవుడు, నా కుటుంబం, స్నేహితులు, సహచరులు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, అభిమానులు లేకుండా ఈ ప్రయాణం సాధ్యమయ్యేది కాదు. నా క్రికెట్ ప్రయాణంలో సహకరించిన వారందరికీ నా కృతజ్ఞతలు". అని ఇంస్టాగ్రామ్ ద్వారా వరుణ్ ఆరోన్ తెలిపాడు. 

2011 లో వరుణ్ ఆరోన్ ఐపీఎల్ లో అద్భుతంగా రాణించి ఇంగ్లాండ్ పై తొలిసారి భారత వన్డే జట్టులో చోటు సంపాదించాడు. అదే సంవత్సరం నవంబర్ లో వెస్టిండీస్ పై టెస్ట్ అరంగేట్రం చేశాడు. గంటకు 150 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. టీమిండియా తరపున కేవలం 9 టెస్టులు.. 9 వన్డేలు మాత్రమే ఆడాడు. టెస్టుల్లో 18 వికెట్లు తీసిన ఆరోన్ వన్డేల్లో 11 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆ తరవాత పేలవ ఫామ్ కారణంగా భారత జట్టులో స్థానం కోల్పోయాడు. 

ALSO READ | Robin Uthappa: యువరాజ్ సింగ్ రిటైర్ అవ్వడానికి కోహ్లీనే కారణం.. రాబిన్ ఉతప్ప సంచలన ఆరోపణలు

2015 లో చివరిసారిగా భారత జట్టు తరపున చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. బెంగళూరు వేదికగా జరిగిన ఈ టెస్టులో ఆరోన్ పెద్ద రాణించకపోవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. ఈ పదేళ్లలో ఐపీఎల్ తో పాటు దేశవాళీ క్రికెట్ ఆడుతూ వచ్చాడు. ఐపీఎల్ లో 52 మ్యాచ్ లాడిన ఈ పేసర్ 44 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.