పెళ్లి షాపింగ్ లో వరుణ్, లావణ్య.. వైరల్ అవుతున్న వీడియో

పెళ్లి షాపింగ్ లో వరుణ్, లావణ్య.. వైరల్ అవుతున్న వీడియో

టాలీవుడ్‌ యంగ్‌ హీరో మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌(Varun tej), హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి(Lavanya thripati) త్వరలో పెళ్లిచేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకైతే అధికారికంగా పెళ్లి డేట్ ఫిక్స్ చేయలేదు కానీ.. ప్రస్తుత సమాచారం మేరకు నవంబర్‌ 1న వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. ఇటలీలోని ఒక పెద్ద ప్యాలెస్‌లో ఈ వివాహ వేడుక జరగనుందని, ఈ వేడుకకు కేవలం అత్యంత సన్నిహితులు, బంధు మిత్రులు మాత్రమే హాజరకానున్నారని సమాచారం.

ALSO READ: ఈ పూజలు, మొక్కులు పెళ్లి కోసమేనా? క్లారిటీ ఇచ్చిన అనుష్క 

ఇందులో భాగంగానే తాజాగా.. వరుణ్, లావణ్య జంట తమ పెళ్లికి సంబంధించిన షాపింగ్‌ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా వరుణ్‌ తేజ్‌- లావణ్య ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా షో రూమ్‌కు వెళ్లారు. పెళ్ళికి  సంబంధించిన దుస్తులు సెలెక్ట్ చేసుకోవడం కోసమే వీరు అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.