వరుణ్ బేవరేజెస్‌‌‌‌ రూ.7,500 కోట్ల సేకరణ

వరుణ్ బేవరేజెస్‌‌‌‌ రూ.7,500 కోట్ల సేకరణ

న్యూఢిల్లీ: పెప్సీ డ్రింక్‌‌‌‌లను అమ్మే వరుణ్ బేవరేజెస్‌‌‌‌  క్వాలిఫైడ్ ఇన్‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు  షేర్లను అమ్మడం ద్వారా రూ.7,500 కోట్లు సేకరించాలని ప్లాన్ చేస్తోంది. బుధవారం జరిగిన బోర్డ్ మీటింగ్‌‌‌‌లో షేర్ హోల్డర్లు ఆమోదం తెలిపారని కంపెనీ ఎక్స్చేంజ్‌‌‌‌ ఫైలింగ్‌‌‌‌లో పేర్కొంది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దశల్లో ఈ ఫండ్స్‌‌‌‌ను సేకరించనుంది.

సబ్సిడరీలు, జాయింట్ వెంచర్లు లేదా అసోసియేట్ కంపెనీల్లో  ఇన్వెస్ట్ చేయడానికి ఈ ఫండ్స్‌‌‌‌ను వినియోగించనుంది. అంతేకాకుండా కొంత అమౌంట్‌‌‌‌ను అప్పులు తీర్చడానికి, కార్పొరేట్ అవసరాలకు  వాడనుంది. ఇండియాలో అమ్ముడయ్యే పెప్సీకో డ్రింక్‌‌‌‌లలో 90 శాతం  వరుణ్ బెవరేజెస్ ద్వారానే జరుగుతున్నాయి.