అహ్మదాబాద్ : ఛేజింగ్‌లో వరుణ్ గౌడ్ (109 నాటౌట్), కెప్టెన్ తిలక్ వర్మ (99) చెలరేగడంతో.. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా మంగళవారం జరిగిన గ్రూప్–సి ఐదో మ్యాచ్‌లో హైదరాబాద్ 3 వికెట్ల తేడాతో కర్ణాటకపై నెగ్గింది. టాస్ నెగ్గిన కర్ణాటక 50 ఓవర్లలో 320/8 స్కోరు చేసింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (124), సమ్రాన్ (83), నికిన్ జోస్ (37) రాణించారు. చామ మిలింద్ 3 వికెట్లు తీశాడు.
తర్వాత హైదరాబాద్ 49.4 ఓవర్లలో 322/7 స్కోరు చేసి నెగ్గింది. సున్నా రన్స్‌కే రోహిత్ రాయుడు (0) ఔటైనా.. తిలక్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తన్మయ్ (35)తో రెండో వికెట్‌కు 70, వరుణ్‌తో ఐదో వికెట్‌కు 112 రన్స్ జత చేశాడు. వరుణ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.