IND vs ENG: రిటైర్ అవ్వాల్సిన స్టేజ్‌లో వన్డే అరంగేట్రం.. అరుదైన లిస్టులో టీమిండియా స్పిన్నర్

IND vs ENG: రిటైర్ అవ్వాల్సిన స్టేజ్‌లో వన్డే అరంగేట్రం.. అరుదైన లిస్టులో టీమిండియా స్పిన్నర్

టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఇంగ్లాండ్ తో కటక్‌లోని బారామతి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో అతనికి తుది జట్టులో అవకాశం దక్కింది. 33 ఏళ్ళ వయసులో వరుణ్ వన్డేల్లో అరంగేట్రం చేయడం విశేషం. దీంతో వన్డేల్లో  డెబ్యూ చేసిన రెండో అతి పెద్ద వయస్కుడిగా నిలిచాడు. భారత్ తరపున ఫరూఖ్ ఇంజనీర్ 36 ఏళ్ళ వయసులో వన్డేల్లో అరంగేట్రం చేసి అతి పెద్ద వయస్కుడిగా నిలిచాడు.  

కుల్దీప్ యాదవ్ స్థానంలో స్థానం దక్కించుకున్న వరుణ్ కు ఆల్ రౌండర్ జడేజా  అరంగేట్ర క్యాప్‌ను వరుణ్‌కు అందజేశారు. తన తొలి మ్యాచ్ రెండో ఓవర్లోనే వరుణ్.. పిల్ సాల్ట్ వికెట్ తీసి భారత్ కు శుభారంభం ఇచ్చాడు. నాగ్‌పూర్‌లో జరిగిన తొలి మ్యాచ్‌కు ముందు వరుణ్ చక్రవర్తిని వన్డే జట్టులోకి తీసుకున్నారు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సిరీస్ లో మొత్తం 14 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు.

ALSO READ | ENG vs IND ODI: రెండో వన్డేలో టాస్ ఓడిన భారత్.. జైశ్వాల్ ఔట్.. కోహ్లీ ఇన్
  
ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బట్లర్ సేన నలుగురు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగుతుంది. మరోవైపు భారత్ ప్లేయింగ్ 11 లో రెండు మార్పులు చేసింది. కుల్దీప్ యాదవ్ స్థానంలో వరుణ్ చక్రవర్తి స్థానం దక్కింది. తొలి వన్డేలో మోకాలి నొప్పితో దూరమైన విరాట్ కోహ్లీ జైశ్వాల్ స్థానంలో తుది జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 16 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. డకెట్ (63) హాఫ్ సెంచరీ చేసి రాణించాడు.