Team India: నేను పిల్ల బచ్చాను.. అశ్విన్‌తో నన్ను పోల్చకండి: భారత మిస్టరీ స్పిన్నర్

Team India: నేను పిల్ల బచ్చాను.. అశ్విన్‌తో నన్ను పోల్చకండి: భారత మిస్టరీ స్పిన్నర్

భారత దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ వారసుడిగా తనను పోల్చడాన్ని మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తోసిపుచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్లు పడగొట్టిన అశ్విన్‌తో తనను పోల్చడం సరైనది కాదని బదులిచ్చాడు. ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న తాను.. అంత పెద్ద బాధ్యతలు మోయలేనని తెలిపాడు. 

చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య శనివారం(జనవరి 25) రెండో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత స్పిన్నర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 

"అశ్విన్‌తో నన్ను పోల్చడం చాలా పెద్ద బాధ్యత. నేను ఇప్పుడిప్పుడే సత్తా చాటుతున్న.. అశ్విన్ మూడు ఫార్మాట్లలో ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 500కి పైగా వికెట్లు తీసుకున్నాడు. అతనితో పోల్చగలిగే స్థాయికి నేనింకా చేరుకోలేదు.." అని ఇండియా టుడేతో మాట్లాడుతూ వరుణ్ చక్రవర్తి అన్నారు.

నాణ్యమైన బౌలర్.. కెప్టెన్ ఆయుధం

ఆఫ్ స్పిన్నరైన వరుణ్ చక్రవర్తి.. కెప్టెన్ ఆయుధమని చెప్పుకోవాలి. పవర్ ప్లేలో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేయగలడు. గతేఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత తిరిగి భారత జట్టులోకి వచ్చిన వరుణ్ చక్రవర్తి.. రీఎంట్రీలో సత్తా చాటుతున్నాడు. అప్పటి నుండి, తన చివరి ఎనిమిది టీ20ల్లో 20 వికెట్లతో భారత స్టార్ స్పిన్నర్‌గా నిలిచాడు. ఈడెన్ గడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో తన 4 ఓవర్లలో 3/23తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌''గా నిలిచాడు. 

ALSO READ | Mohammed Siraj: రోహిత్‌కు సిరాజ్ కౌంటర్.. ఓల్డ్ బాల్‌తోనే ప్రాక్టీస్ స్టార్ట్