IND vs ENG: టీమిండియా స్క్వాడ్‌లో వరుణ్ చక్రవర్తి.. కుల్దీప్‌కు స్పాట్ పెట్టిన మిస్టరీ స్పిన్నర్

IND vs ENG: టీమిండియా స్క్వాడ్‌లో వరుణ్ చక్రవర్తి.. కుల్దీప్‌కు స్పాట్ పెట్టిన మిస్టరీ స్పిన్నర్

ఇంగ్లాండ్ తో ఇటీవలే జరిగిన నాలుగు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో అద్భుతంగా రాణించిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వన్డే జట్టులోనూ ఎంపికైనట్టు తెలుస్తుంది. మంగళవారం (ఫిబ్రవరి 4) వరుణ్ భారత వన్డే జట్టుతో ప్రాక్టీస్ చేస్తున్న ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఫిబ్రవరి 6న ఇంగ్లాండ్‌తో తొలి వన్డే ఆడనుంది. ఈ మ్యాచ్ కు ముందు వరుణ్ చక్రవర్తి నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించాడు. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మధ్యాహ్నం శిక్షణా సెషన్ జరిగింది.

మొదట వన్డే సిరీస్ కు ఎంపిక చేసిన 15 మంది స్క్వాడ్ లో వరుణ్ చక్రవర్తికి స్థానం దక్కలేదు. అయితే ఈ తమిళ నాడు స్పిన్నర్ టీ20 సిరీస్ లో 5 మ్యాచ్ లో 14 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. వరుణ్ బౌలింగ్ ఆడడానికి ఇంగ్లాండ్ పూర్తిగా తడబడింది. ఈ మిస్టరీ స్పిన్నర్ ను ఎదుర్కోలేక వికెట్లు సమర్పించుకున్నారు. ఇంగ్లాండ్ తో జరగబోయే సిరీస్ లో వరుణ్ రాణిస్తే అతనికి ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. 15 మంది సభ్యుల జట్టులో భారత్ నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేసింది. 

Also Read :  సచిన్ మరో ఆల్‌టైం రికార్డుకు చేరువలో కోహ్లీ

స్పిన్ ఆల్ రౌండర్లు జడేజా, సుందర్, అక్షర్ పటేల్ తో పాటు స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ కు చోటు దక్కింది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన స్క్వాడ్ లో మార్పులు చేసుకోవడానికి ఫిబ్రవరి 11 వరకు సమయం ఉంది. ఒకవేళ వరుణ్ చక్రవర్తి ఎంపికైతే కుల్దీప్ స్థానం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ప్రస్తుతం కుల్దీప్ పెద్దగా ఫామ్ లో లేడు. దీంతో అతని స్థానంలో స్పెషలిస్ట్ స్పిన్నర్ గా వరుణ్ కు అవకాశం దక్కనుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఫిబ్రవరి 6న (గురువారం) నాగ్‌పూర్‌లో తొలి వన్డే జరగనుంది. రెండో వన్డే ఫిబ్రవరి 9న కటక్‌లో జరగనుండగా, మూడో మరియు చివరి మ్యాచ్ ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌లో జరగనుంది.

ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కు టీమ్ ఇండియా:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పన్ , రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా (మొదటి రెండు వన్డేలు), జస్ప్రీత్ బుమ్రా (మూడో వన్డే), వరుణ్ చక్రవర్తి.