వరుణ్ ధావన్, కీర్తి సురేష్ నటించిన బేబీ జాన్ (Baby John) మూవీ సడెన్గా ఓటీటీకి వచ్చేసింది. నేడు (ఫిబ్రవరి 5) నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ప్రస్తుతం రెంటల్ విధానంలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) నుంచి ఫ్రీ స్ట్రీమింగ్‌కు వచ్చే ఛాన్స్ ఉంది.
కీర్తి సురేష్ ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న రిలీజై బాక్సాఫీస్ వద్ద దారుణ ఫలితాన్ని చవిచూసింది. దాదాపు రూ.160 కోట్లకి పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ కేవలం రూ.60 కోట్లు మాత్రమే సంపాదించింది. అంటే, దాదాపు ఈ సినిమాకి రూ.100 కోట్లకి పైగా నష్టాలు వచ్చాయని సమాచారం. దీంతో బాలీవుడ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న కీర్తి సురేష్ కి డిజాస్టర్ ఎంట్రీ మిగిలింది.
Also Read :- మూడు సినిమాల బడ్జెట్ డాక్యుమెంట్లను ఐటీ అధికారులకు ఇచ్చిన దిల్ రాజు
డైరెక్టర్ అట్లీ 2016లో తెరకెక్కించిన తమిళ చిత్రం తేరి చిత్రానికి ఇది రీమేక్. అయితే, ఈ సినిమా తమిళంలో పెద్ద హిట్ అయినప్పటికీ హిందీలో మాత్రం భారీ డిజాస్టర్ అయింది. స్టోరీ ఔట్‌డేటెడ్ కావడం, యాక్షన్ డొసేజ్ పెంచడం, ఎమోషన్స్ సరిగ్గా వర్కవుట్ కాకపోవడం సినిమాను డిజాస్టర్‌గా మిగిల్చింది.
కేవలం తమన్ అందించిన మట్కా సాంగ్ ఆడియన్స్ను అట్ట్రాక్ట్ చేసినప్పటికీ థియేటర్స్కి రప్పించలేకపోయింది.ఇకపోతే ఈ సినిమాను జీ స్టూడియోస్‌తో కలిసి డైరెక్టర్ అట్లీ నిర్మించాడు. ఇందులో వామికా గబ్బి మరో హీరోయిన్. కాలీస్ దర్శకత్వం వహించాడు.