
ఓవైపు కోలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న పూజా హెగ్డే.. మరోవైపు బాలీవుడ్‌లోనూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఆమె వరుణ్ ధావన్‌కు జంటగా ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ అనే చిత్రంలో నటిస్తోంది. డేవిడ్ ధావన్ ఈ చిత్రానికి దర్శకుడు. రమేష్ తౌరానీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రిషికేశ్‌లో జరుగుతోంది. షూటింగ్‌కు ముందుగా అక్కడ పరమార్థ నికేతన్ ఆశ్రమాన్ని వరుణ్, పూజ సందర్శించారు.
మొక్కలు నాటడంతో పాటుగా గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్‌ను పూజా హెగ్డే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మూడు రోజుల పాటు అక్కడ చిత్రీకరణ జరగనుంది. ఇందులో మృణాల్ ఠాకూర్ కీలకపాత్ర పోషించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక సూర్యకు జంటగా పూజ నటించిన ‘రెట్రో’ చిత్రం మే1న ప్రేక్షకుల ముందుకురానుంది.