Citadel: Honey Bunny Teaser: యాక్షన్‌ థ్రిల్లింగ్‌తో వరుణ్‌ ధావన్‌-సమంత ‘సిటాడెల్‌’ టీజర్..స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌

Citadel: Honey Bunny Teaser: యాక్షన్‌ థ్రిల్లింగ్‌తో వరుణ్‌ ధావన్‌-సమంత ‘సిటాడెల్‌’ టీజర్..స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌

గత ఏడాది ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత..త్వరలో సిటాడెల్ వెబ్‌ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు రానుంది. సమంత, వరుణ్ ధావన్ లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో నటించిన ‘సిటాడెల్‌‌‌‌‌‌‌‌' వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌‌ ను ఫ్యామిలీ మేన్‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌తో మెప్పించిన రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు.

హాలీవుడ్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన సిటాడెల్‌‌‌‌‌‌‌‌’ సిరీస్‌‌‌‌‌‌‌‌కు ఇది ఇండియన్‌‌‌‌‌‌‌‌ వెర్షన్. దీనికి సిటాడెల్: హనీ బన్నీ (Citadel Honey Bunny) అనే పేరు పెట్టారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్‌‌‌‌‌‌‌‌ పూర్తయి నెలలు గడుస్తోంది. దీంతో ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

తాజాగా సిటాడెల్‌‌‌‌‌‌‌‌ వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌‌ నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. సిటాడెల్: హనీ బన్నీ నిర్మాతలు ఎట్టకేలకు టీజర్‌తో పాటు సిటాడెల్ ఇండియన్ వెర్షన్ రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. టీజర్‌లో సమంత, వరుణ్ ఇద్దరూ ఆకట్టుకున్నారు. టీజర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతున్న 'రాత్ బాకీ' సాంగ్ ఆడియన్స్ లో ఇంప్రెషన్‌ని పెంచుతోంది.

ఇకపోతే ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్, సమంతతో పాటు సిటాడెల్‌లో నటించిన సికందర్ ఖేర్, కెకె మీనన్ మరియు షకీబ్ సలీమ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సిరీస్‌ను భారత్‌తో పాటు సైబీరియాలో కూడా చిత్రీకరించారు. ఈ సిరీస్‌లో సమంత పూర్తిగా భిన్నమైన అవతార్‌లో కనిపించబోతోంది. కాగా సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌‌ నవంబరు 7వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. హిందీతో పాటు, భారతీయ భాషల్లోనూ ఈ సిరీస్‌ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. 

టీజర్ రివ్యూ: 

వరుణ్‌,సామ్‌ కలిసి చేసే యాక్షన్‌ సీన్స్ హైలెట్ గా  ఉన్నాయి. 1990ల నేపథ్యంలో ఈ సిరీస్‌ సాగుతోందని తెలుస్తోంది. ఎలాంటి డూప్‌ లేకుండా సామ్‌ స్వయంగా యాక్షన్‌ సీక్వెన్స్‌ను పూర్తి చేశారట. అయితే, ఇందులో కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా..కొన్ని ఎమోషన్స్ ని కూడా పలికించారు. అంటే సమంత ఆనందంగా కనిపించడం, గన్స్ పట్టుకుని యుద్ధం చేయడం, ఒక చిన్నారి కోసం కంగారు పడటం అన్నీ చూపించారు. మొత్తానికి ఒక సర్వైవల్ యాక్షన్ డ్రామా థ్రిల్లర్ అనే విషయం అయితే అర్థమవుతోంది. రుస్సో బ్రదర్స్‌ నిర్మిస్తున్న ఈ సిరీస్‌ పలు దేశాల్లో, వివిధ భాషల్లో రూపొందుతోంది. 

అయితే, మార్వెల్ స్టార్ రిచర్డ్ మాడెన్‌తో పాటు ప్రియాంక చోప్రా సిటాడెల్ యొక్క ఒరిజినల్ వెర్షన్‌లో ముఖ్యమైన పాత్ర పోషించింది. ఈ సిరీస్ కోసం అమెజాన్ ఏకంగా  250 మిలియన్ డాలర్స్ వరకు ఖర్చు చేసిందట. మన దేశ కరెన్సీలో ఇది రూ. 2000 కోట్లకు సమానం. సిటాడెల్ పరాజయంతో అమెజాన్ రూ.2000 కోట్లు వృధా అయిపొయిందని సమాచారం.మరి హాలీవుడ్ లో సక్సెస్ కానీ ఈ సిరీస్.. ఇండియన్ వర్షన్ లో ఏ మేరకు మెప్పించనుందో చూడాలి మరి. ఒకవేళ సిటాడెల్ ఇండియన్ వర్షన్ గనక హిట్ అయితే.. అమెజాన్ కు కాస్త ఊరట లభిస్తుంది అని చెప్పొచ్చు.