సమ్మర్‌‌‌‌లో సమంత సిటాడెల్‌!

అటు సినిమాలు.. ఇటు యాడ్స్.. మధ్యలో వెబ్‌‌ సిరీసులు.. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌‌తో క్షణం తీరిక లేకుండా ఉంది సమంత. ఆమె నటించిన ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ మూవీ వచ్చే నెలలో విడుదల కాబోతోంది. గుణశేఖర్ తీసిన ‘శాకుంతలమ్‌‌’ కూడా రిలీజ్‌‌కి రెడీ అవుతోంది. ‘యశోద’ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సౌత్‌‌లో ఇంత బిజీగా ఉండి కూడా నార్త్‌‌లో తన ముద్ర వేయడానికి సిద్ధపడుతోంది సామ్. ఆల్రెడీ ‘ఫ్యామిలీమేన్‌‌ 2’తో అక్కడి వారికి చాలా దగ్గరయ్యింది. ఇప్పుడు అదే మేకర్స్‌‌ తీస్తున్న ‘సిటాడెల్’ అనే వెబ్‌‌ సిరీస్‌‌ కూడా చేయబోతోంది. వరుణ్ ధావన్ హీరో. రసో బ్రదర్స్ ఇదే టైటిల్‌తో తీసిన అమెరికన్ సైన్స్‌‌ ఫిక్షన్‌‌ టెలివిజన్ సిరీస్‌‌కి ఇది రీమేక్. ఒరిజినల్‌‌లో ప్రియాంకా చోప్రా నటించింది. రీమేక్​లో సమంత చేస్తోంది. వరుణ్, సామ్‌‌ల పాత్రలు చాలా డైనమిక్‌‌గా ఉండబోతున్నాయని, హై ఆక్టేన్ యాక్షన్ సీన్స్‌‌ కోసం వరుణ్ త్వరలో ట్రైనింగ్ తీసుకోనున్నాడని టీమ్ చెబుతోంది. ప్రీ ప్రొడక్షన్ పక్కాగా చేసుకుని, జూలైలో షూటింగ్‌‌ స్టార్ట్ చేయబోతున్నారు. మేజర్ పార్ట్ ముంబైలోనే తీయనున్నారు. కొంత భాగం యూరప్‌‌లో కూడా షూట్ చేస్తారు. ఇది అయ్యాక ఇంగ్లిష్ మూవీ ‘ద అరేంజ్‌‌మెంట్స్‌‌ ఆఫ్‌‌ లవ్‌‌’ కూడా చేయాల్సి ఉంది సమంత. అలాగే తాప్సీ నిర్మించనున్న ఫిమేల్ ఓరియెంటెడ్‌‌ చిత్రంలో ఆమె నటించనుందట. విజయ్ దేవరకొండతోనూ జోడీ కట్టనుందని టాక్.