IND vs AUS: హెడ్ వికెట్ క్రెడిట్ కొట్టేసిన బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్!

IND vs AUS: హెడ్ వికెట్ క్రెడిట్ కొట్టేసిన బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్!

భారత్, ఆస్ట్రేలియా మధ్య మంగళవారం (మార్చి 4) జరిగిన సెమీ ఫైనల్లో టీమిండియా మిస్టరీ స్పిన్నర్ హీరోగా మారాడు. తీసింది రెండు వికెట్లు అయినా.. అందులో ప్రమాదకరమైన హెడ్ వికెట్ ఉండడం టీమిండియా అభిమానులకు తెగ కిక్ ఇస్తుంది. బౌండరీలతో విరుచుకు పడుతూ జోరు మీదున్న ట్రావిస్‌ హెడ్‌ (39)ను వరుణ్‌ చక్రవర్తి పెవిలియన్‌కు పంపాడు. బౌలింగ్‌కు వచ్చీ రాగానే వికెట్‌ తీసుకున్నాడు.

వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో తొమ్మిదో ఓవర్ రెండో బంతిని భారీ షాట్‌కు యత్నించి హెడ్‌.. గిల్‌ చేతికి చిక్కాడు. దాంతో, భారత జట్టుకు ఉపశమనం లభించినట్టైంది. అంతకుముందు హెడ్.. కౌంటర్ అటాక్‌తో భారత్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాడు. హార్దిక్ పాండ్యా వేసిన నాలుగో ఓవర్‌లో ఫోర్‌, సిక్స్ బాదిన హెడ్‌.. షమీ వేసిన ఐదవ నాలుగో ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్లు రాబట్టాడు. మూడు, నాలుగు, ఐదు బంతులను వరుసగా బౌండరీకి తరలించాడు.

ALSO READ | Champions Trophy 2025: రచీన్ రవీంద్ర మరో సెంచరీ.. సఫారీలపై కివీస్ పరుగుల వరద

హెడ్ వికెట్ తీయడంతో దేశమంతా ఓ రేంజ్ లో సెలబ్రేషన్ చేసుకుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో నవ్వు తెప్పించే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇంస్టాగ్రామ్ లో వరుణ్ చక్రవర్తిని ప్రశంసించాలనుకున్న కొంతమంది అభిమానులు పొరపాటున ఆ క్రెడిట్ ను బాలీ వుడ్ హీరో వరుణ్ ధావన్ కు ఇచ్చారు. బాగా బౌల్డ్ చేసావ్ వరుణ్ భయ్యా అని ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఇద్దరి పేర్లలో ప్రారంభంలో వరుణ్ రావడంతో అభిమానులు గందరగోళానికి గురయ్యారు. ఈ విషయాన్ని వరుణ్ చక్రవర్తి సరదాగా తీసుకోగా.. వరుణ్ ధావన్ మాత్రం ఆ క్రెడిట్ కోటేస్తూ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు.