
అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘రాచరికం’. సురేశ్ లంకలపల్లి దర్శకత్వంలో ఈశ్వర్ నిర్మించారు. జనవరి 31న సినిమా విడుదల కానుంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా అప్సరా రాణి మాట్లాడుతూ ‘ఒకే తరహా పాత్రలు వస్తున్నాయని సినిమాలు వదిలేయాలని అనుకున్నా. ఆ టైంలోనే ఈ ఆఫర్ వచ్చింది. ఇందులో నా క్యారెక్టర్ అందరికీ నచ్చుతుంది’ అని చెప్పింది.
విజయ్ శంకర్ మాట్లాడుతూ ‘ఈ టైటిల్‌లోనే ఓ రాయల్టీ ఉంటుంది. ఈ సినిమాను ప్రేక్షకులకు ఎప్పుడెప్పుడు చూపిస్తామా? అని అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. రాయలసీమ అంటే ఏంటో ఈ సినిమా చూపిస్తుంది’ అని అన్నాడు. ఇందులో నెగిటివ్ రోల్ చేశానని వరుణ్ సందేశ్ చెప్పాడు.
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న పొలిటికల్ రివేంజ్ డ్రామా ఇది అని దర్శకుడు సురేశ్ లంకపల్లి చెప్పాడు. ఈ సినిమాకు సపోర్ట్ చేసిన వారందరికీ థ్యాంక్స్ చెప్పాడు నిర్మాత ఈశ్వర్. మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.