Varun Tej New Movie Update: మళ్ళీ కొత్త ప్రయోగం చేయనున్న వరుణ్ తేజ్.. ఈసారి కొరియన్ సినిమాలో..

టాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ తేజ్ ఈ మధ్య వరుస ఫ్లాపులు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవలే వరుణ్ తేజ్ హీరోగా నటించిన మట్కా సినిమా దాదాపుగా రూ.50 కోట్లతో నిర్మించగా జీరో షేర్ తో నిర్మాతలకి పూర్తి నష్టాలని తెచ్చిపెట్టింది. అయితే ఈసారి వరుణ్ తేజ్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడు. 

ఈ క్రమంలో తెలుగులో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, తదితర హిట్ సినిమాలని డైరెక్ట్ చేసిన ప్రముఖ డైరెక్టర్ మెర్లపాక గాంధీతో జతకట్టనున్నారు. ఈ సినిమాని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యువీ సినీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఆదివారం వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ని ప్రకటించారు. ఇందులోభాగంగా VT15 వర్కింగ్ టైటిల్ తో కొరియన్ హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ee సినిమాకి ఓప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. దీంతో వరుణ్ తేజ్ కి అభిమానులు బర్త్ డే విషెస్ చెబుతూ కొత్త సినిమాకి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. 

ఈ విషయం ఇలా ఉండగా గత నాలుగేళ్లలో నటించిన గని, ఎఫ్ 3, గాండీవధార అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా తదితర సినిమాలలో ఎఫ్ 3 మిగిలిన అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో డైరెక్టర్ గాంధీ సినిమాతో సక్సెస్ అందుకోవాలని వరుణ్ తీవ్రంగానే శ్రమిస్తున్నాడు.