
‘ఆపరేషన్ వాలంటైన్’,‘మట్కా’సినిమాలతో వరుస డిజాస్టర్స్ అందుకున్నారు వరుణ్ తేజ్. ప్రస్తుతం ప్రయోగాలకు గ్యాప్ ఇచ్చి కంటెంట్ బేస్డ్ సినిమాతో రావాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలో వరుణ్ తేజ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) చెప్పిన కథకు సెరెండెర్ అయ్యాడు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా లాంటి ఎంటర్టైనర్లు తీసిన మేర్లపాక గాంధీకి ఛాన్స్ ఇచ్చాడు.
లేటెస్ట్గా ఈ సినిమా జోనర్కి సంబంధించి ఓ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. కమెడియన్ సత్యతో అందరినీ నవ్వించేలా, ఉత్కంఠను కలిగించేలా ఓ ఫన్నీ ప్రోమోతో ఆసక్తి పెంచారు. ఇందులో హీరో వరుణ్, డైరెక్టర్ గాంధీ, సత్య చేసిన కామెడీ ఆసక్తి కలిగిస్తోంది. కామెడీ కాదు, హారర్ కామెడీ!!! అని చెప్పడానికి చేసిన ఈ ప్రయత్నం మెగా ఫ్యాన్స్ను ఆకట్టుకుంది. ఇది వరుణ్ కెరీర్లో 15వ మూవీగా తెరకెక్కుతుంది.
ఈ మూవీ కొరియన్ హార్రర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని, ఇప్పటికే షూటింగ్ మొదలైందని ఈ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీకి కొరియన్ కనకరాజ్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఫస్ట్ ప్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్-యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతం అందించనున్నాడు. త్వరలో మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
ALSO READ : RC16: రామ్ చరణ్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. RC16 నుంచి అదిరిపోయే అప్డేట్
ఇక మేర్లపాక గాంధీ సినిమాల విషయానికి వస్తే.. ఆయన చివరిగా 2022లో లైక్ షేర్ సబ్ స్క్రైబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అంతకుముందు వచ్చిన `ఏక్ మినీ కథ`..`మ్యాస్ట్రో` సినిమాల పరిస్థితి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆయన హిట్ సినిమాలు చెప్పుకోవాలంటే ఫస్ట్ సినిమా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా.. ఈ రెండు ఆడియన్స్ని బాగా నవ్వించాయి. అందరికీ నచ్చేశాయి. కానీ, నానితో తీసిన `కృష్ణార్జున యుద్దం` నుంచి కష్టాలు షురూ అయ్యాయి. మరి ఇప్పుడు వరుణ్ తీసే చిత్రంతో మ్యాజిక్ చేసి తీరాల్సిందే. ఎందుకంటే, డైరెక్టర్గా మేర్లపాక గాంధీకి సక్సెస్ ఎంత అవసరమో..ఫెయిల్యూర్స్తో సతమవుతున్న వరుణ్ కెరీర్కు అంతే అవసరం.
Kickstarting the next one with a whole lot of new energy!
— Varun Tej Konidela (@IAmVarunTej) March 24, 2025
Need all your love & wishes ❤️#VT15@GandhiMerlapaka @RitikaNayak_ @musicthaman #ManojhReddy @UV_Creations @FirstFrame_Ent pic.twitter.com/Ovy9dUHATj