వరుణ్ తేజ్(Varun Tej), సాయి పల్లవి(Sai Pallavi) నటించిన చిత్రం ఫిదా(Fida).. ఈ సినిమా ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఫిదా.. సాయి పల్లవితోపాటు వరుణ్ కూ మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత సాయి పల్లవి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయ్యింది. ఈ ఇద్దరు కలిసి మళ్లీ ఒక సినిమా చేస్తే బాగుంటుందని, జోడీకి మంచి మార్కులు వచ్చాయి కనుక సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవుతుందనే చర్చ సాగుతోంది. ఆ చాన్స్ వచ్చినా తానే నో చెప్పినట్లు స్వయంగా వరుణ్ తేజ్ ప్రకటించాడు.
ఆపరేషన్ వాలంటైన్ ప్రమోషన్ లో భాగంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మీడియాతో మాట్లాడాడు.. ‘ఆ మధ్య ఒక కథ వచ్చింది. అయితే తమ నుంచి రాబోతున్న సినిమా ఫిదా ను మించి ఉండాలని కోరుకుంటున్నాం. కానీ మేం విన్న కథ ఫిదాను మించలేదనే ఉద్దేశంతో నో చెప్పాం. కచ్చితంగా ఇద్దరికి సెట్ అయ్యి, ఫిదా ను మించి హిట్ అయ్యే కథ తో వస్తే తప్పకుండా సాయి పల్లవితో కలిసి నటిస్తా’ అంటున్నాడు వరుణ్ తేజ్. ఫిదా ను మించడం అంటే కొంచం కష్టమే మరి. ఈ ఇద్దరినీ మెప్పించే స్థాయి కథ ను ఏ దర్శకుడు రెడీ చేస్తాడో చూడాలి.