![Gandeevadhari Arjuna twitter Review: యాక్షన్ ఓకే.. మరి రిజల్ట్ ఏంటి?](https://static.v6velugu.com/uploads/2023/08/Varun-tej-Gandeevadhari-Arjuna-twitter-Review_LOlnFNw7M9.jpg)
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్(Varun tej) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ గాండీవధారి అర్జున(Gandeevadhari Arjuna). ప్రవీణ్ సత్తారు(Pravin sattaru) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో సాక్షి వైద్య(Sakshi vaidya) హీరోయిన్ గా నటించింది. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీకి మిక్కీ జే. మేయర్ సంగీతం అందించాడు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇప్పటికే పలుచోట్ల షోస్ పడటంతో ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు. మరి గాండీవధారి అర్జున సినిమా ఎలా ఉంది? ఈ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆడియన్స్ ను ఏమేరకు మెప్పించింది? నేయి ఇప్పుడు చూద్దాం.
ఆడియన్స్ నుండి గాండీవధారి అర్జున సినిమాకు నెగిటీవ్ టాక్ వినిపిస్తోంది. సినిమా చాలా స్టైలిష్‌గా ఉన్నా.. అంతగా వర్కవుట్ కాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమా చాలా స్లోగా, బోరింగ్‌గా ఉందంటున్నారు. ఫస్టాఫ్‌లో తల్లి సెంటిమెంట్, యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నా ఎక్కడో సోల్ మిస్ అయిందనే అంటున్నారు. ఇక మొత్తంగా ప్రవీణ్ సత్తారు ఈసారి కూడా నిరాశపర్చాడని చెప్తున్నారు. మరి పూర్తి టాక్ ఏంటి అనేది తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.