రివ్యూ: గని

రివ్యూ: గని
రన్ టైమ్: 2 గంటల 20 నిమిషాలు
నటీనటులు: వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, సునీల్ శెట్టి, ఉపేంద్ర, జగపతిబాబు, నదియా, నవీన్ చంద్ర తదితరులు
సినిమాటోగ్రఫీ: జార్జ్ సి.విలియమ్స్
మ్యూజిక్ :తమన్
మాటలు: 
నిర్మాతలు: సిద్దూ ముద్ద, అల్లు బాబీ
రచన,దర్శకత్వం: కిరణ్ కొర్రపాటి
రిలీజ్ డేట్: ఏప్రిల్ 8,2022

కథేంటి
గని ఫాదర్ విక్రమాదిత్య  నేషనల్ బాక్సింగ్ చాంపియన్. కానీ స్టెరాయిడ్స్ తీసుకున్నారని బాక్సింగ్ నుండి వెలివేస్తారు. చిన్నప్పటి నుంచి గని (వరుణ్ తేజ్) బాక్సింగే లైఫ్ గా పెరుగుతాడు.కానీ వాళ్ల నాన్న అలా చేసాడని తెలిసాక తనని ధ్వేషిస్తాడు. అయినా సరే అమ్మకు తెలియకుండా బాక్సింగ్ చాంపియన్ కావాలని పోరాడుతాడు. చివరకి ఏం జరిగింది. గని నెగ్గాడా? ఇంతకీ వాళ్ల నాన్న దోషి యేనా అనేది కథ.
 

నటీనటుల పర్ఫార్మెన్స్:
వరుణ్ తేజ్ కటౌట్ కు తగ్గ రోల్ ఇది. బాక్సర్ రోల్ పర్ఫెక్ట్ గా సరిపోయాడు. బాడీ ని పెంచడం కోసం చాలా కష్టపడ్డాడు.అదంతా సినిమాలో తెలుస్తుంది. హీరోయిన్ సాయి మంజ్రేకర్ కు తగిన పాత్ర దక్కలేదు.తను కూడా యావరేజ్ గా ఉంది. ఉపేంద్ర ,సునీల్ శెట్టి,జగపతి బాబు,నదియా తమ పాత్రలలో ఒదిగిపోయి నటించారు.నవీన్ చంద్ర బాగా చేసాడు.
 

టెక్నికల్ వర్క్:
జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ బాగుంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాను ఎలివేట్ చేసాడు. కాకపోతే కొన్ని సార్లు లౌడ్ అనిపించింది.ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా ఉండాల్సింది. ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ వాల్యూయ్స్ బాగున్నాయి. డైలాగులు కొన్ని బాగున్నాయి.
 

విశ్లేషణ:
‘‘గని’’ రెగ్యులర్ బాక్సింగ్ డ్రామా. ఇందులో ఎమోషన్ ను జోడించాలని డైరెక్టర్ భావించాడు కానీ అది సరిగా కన్వే అవ్వలేదు. తరువాతేం జరుగుతుందో ముందే ఊహించవచ్చు. ఫస్టాఫ్ బోరింగ్ గా సాగుతుంది. లవ్ ట్రాక్ అయితే విసిగిస్తుంది. ఇంటర్వెల్ ముందు నుండి కాస్త ఇంట్రెస్టింగ్ కలుగుతుంది.సెకండాఫ్ మొదలైన తర్వాత గ్రిప్పింగా సాగుతుంది. గేమింగ్ సీన్లు ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తాయి. కథ రోటీన్ గానే ఉన్నా కానీ.. వరుణ్ తేజ్ పడిన కష్టం,మ్యూజిక్ వల్ల ఫర్వాలేదనిపిస్తుంది. క్లైమాక్స్ ని తొందరగా ముగించేసినట్టనిపస్తుంది.ఓవరాల్ గా ‘‘గని’’ అంచనాలను అందుకోలేకపోయిందనే చెప్పాలి.బోరింగ్ ఫస్టాఫ్ ,సెకండాఫ్ లో కొన్ని సీన్లు మినహా మిగతా అంతా రొటీన్ డ్రామా. ఓటీటీలో రిలీజయ్యేంతవరకు వెయిట్ చేయవచ్చు.
బాటమ్ లైన్:పంచ్ మిస్సయింది.

మరిన్ని వార్తల కోసం

సర్ఫ్, నూనె, కెమికల్స్​తో పాల తయారీ

పెళ్లికి పెట్రోల్, డీజిల్ బాటిళ్లు గిఫ్ట్ గా ఇచ్చిన ఫ్రెండ్స్