స్పోర్ట్స్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌ మూవీతో వస్తున్న వరుణ్‌‌ తేజ్

వరుణ్‌‌‌‌‌‌‌‌తేజ్‌‌‌‌‌‌‌‌ బాక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటించిన చిత్రం ‘గని’. కిరణ్‌‌‌‌‌‌‌‌ కొర్రపాటి దర్శకుడు. అల్లు అరవింద్‌‌‌‌‌‌‌‌ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించారు. ఏప్రిల్ 8న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా నిర్మాతలిద్దరూ ఇలా ముచ్చటించారు. ‘‘స్పోర్ట్స్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌ మూవీ చేయాలనే ఐడియా వరుణ్‌‌దే. నాలుగేళ్ల క్రితం సినిమా మొదలైంది. ఎమోషన్‌‌‌‌‌‌‌‌ ఉన్న కథ. గతంలో వచ్చిన స్పోర్ట్స్​ మూవీస్​తో ఎలాంటి పోలికలూ లేవు. ఇది పూర్తిగా హీరో జర్నీ. చుట్టూ ఇతర పాత్రలు ఉంటాయి. ప్రతి పాత్రకీ ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్యాన్‌‌‌‌‌‌‌‌ ఇండియా అని కాకుండా కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌కి తగ్గట్టుగా వివిధ భాషల నటీనటుల్ని తీసు కున్నాం.

స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌లో ఉండే పాలిటిక్స్‌‌‌‌‌‌‌‌ని కొత్త కోణంలో చూపించాం. చాలామంది ఆటగాళ్ల జీవితాల్లోని ఎత్తుపల్లాలను తీసుకుని వరుణ్‌‌‌‌‌‌‌‌ పాత్రని డిజైన్ చేశాం. ఫిజికల్‌‌‌‌‌‌‌‌గానే కాక సైకలాజికల్‌‌‌‌‌‌‌‌గానూ చాలా హోమ్ వర్క్ చేశాడు వరుణ్‌‌‌‌‌‌‌‌.  చాలా బుక్స్ చదివి, వీడియోలు చూసి బాడీ లాంగ్వేజ్‌‌‌‌‌‌‌‌ని మార్చుకున్నాడు. ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌లో భుజానికి గాయమైంది. అదే టైమ్‌‌‌‌‌‌‌‌లో చాలామంది యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌‌‌‌‌‌‌‌ని ఓవర్సీస్‌‌‌‌‌‌‌‌ నుంచి రప్పించాం. మరోవైపు కరోనా, సెట్‌‌‌‌‌‌‌‌ను రెండోసారి నిర్మించడం లాంటి రకరకాల సమస్యలు ఎదురయ్యాయి. స్పోర్ట్స్ సినిమా అంటే ఇలాంటి రిస్క్‌‌‌‌‌‌‌‌లు ఉంటాయి. ఫస్ట్ టైమ్ కనుక మాకది తెలియలేదు. వరుణ్ చాలా సపోర్ట్ చేశాడు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఓ మంచి చిత్రం తీశామనే తృప్తి ఉంది. గురు, తుపాన్‌‌‌‌‌‌‌‌ తర్వాత ప్రొఫెషనల్‌‌‌‌‌‌‌‌ బాక్సింగ్‌‌‌‌‌‌‌‌ను చూపిస్తున్న సినిమా ఇదే. ఇదో ఆనెస్ట్ స్పోర్ట్స్ డ్రామా. ఫుల్‌‌‌‌‌‌‌‌ కాన్ఫిడెంట్‌‌‌‌‌‌‌‌గా ఉన్నాం’ అన్నారు.