మట్కా వాసు యొక్క మాస్ షో థియేటర్లో దుమ్మురేపుతోంది. వరుణ్ తేజ్ (Varun Tej) మట్కా (MATKA) మూవీ నవంబర్ 14 న థియేటర్లలో రిలీజై మెగా ఆడియన్స్ ను అలరిస్తోంది. పలాస మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన కరుణకుమార్ (Karuna Kumar) డైరక్ట్ చేసిన ఈ మూవీ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు సమాచారం. దాంతో ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడొస్తుందన్న ఆసక్తి నెలకొంది.
మట్కా ఓటీటీ:
ప్రస్తుతం మట్కా మూవీ బాక్సాఫీస్ దగ్గర ఆడే దాన్ని బట్టి.. ఓటీటీ రిలీజ్ డేట్ ఆధారపడి ఉంటుంది. అయితే, డిసెంబర్ మూడో వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా ప్రైమ్ వీడియో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మట్కా మూవీకి కంగువ భారీ పోటీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలకు టాక్ యావరేజ్ ఉన్నప్పటికీ వీటి మధ్యే పోటీ నెలకొంది.ఓ వైపు దీపావళి రిలీజ్ సినిమాలైనా క, లక్కీ భాస్కర్, అమరన్ మూవీస్ ఇంకా థియేటర్స్ లో ఆడుతుండటం వీటికే కాస్తా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే, ప్రస్తుతం మట్కా, కంగువ సినిమాల పరిస్థితి ఏంటనేది.. ఈ వీకెండ్ కలెక్షన్స్, ఆడియన్స్ రెస్పాన్స్ చెబుతోంది. చూడాలి మరి ఏమవుతుందో!
Also Read : తెలంగాణ నేపథ్యంలో డిటెక్టివ్ వికటకవి
మట్కా స్టోరీ:
మట్కా మూవీలో మట్కా వాసుగా మూడు డిఫరెంట్ వేరియేషన్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో వరుణ్‌తేజ్ నటించాడు. 1958 నుంచి 1982 మధ్య కాలంలో నడిచే స్టోరీగా ఈ మూవీని తెరకెక్కించారు. వాసు (వరుణ్ తేజ్) అనే వ్యక్తి బర్మా నుంచి వైజాగ్‌కు బతుకుతెరువు కోసం వచ్చిన ఓ అతను మట్కా కింగ్‌గా ఎలా అయ్యాడు? ఓ పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా నెలకొల్పాడు. ఈ జర్నీలో అతడి సాగించిన పోరాటంతో ఎమోషన్స్, యాక్షన్, లవ్ స్టోరీ.. ఇలా ప్రతిదీ ఏంటనేది స్టోరీ.
వాసు పాత్రలో వరుణ్ తేజ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నా.. ఊహించగలిగే స్టోరీ లైన్ తో మట్కా మూవీ ఆడియన్స్ ను పెద్దగా థ్రిల్ చేయలేకపోయింది. క్లిచ్ సన్నివేశాలతో నిండిన బోరింగ్ రేజ్ టు రిచ్ డ్రామాని అని సినీ క్రిటిక్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.