Matka: వరుణ్ తేజ్ పీరియాడిక్ థ్రిల్లర్‌ మట్కా రిలీజ్ డేట్ అనౌన్స్

Matka: వరుణ్ తేజ్ పీరియాడిక్ థ్రిల్లర్‌ మట్కా రిలీజ్ డేట్ అనౌన్స్

మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్(Varun Tej)డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ను ఎంచుకుంటూ ఇండస్ట్రీ లో రాణిస్తున్నారు. ప్రయోగాలు చేయడంలో ఈ మెగా హీరో ఎప్పుడు ముందుంటారు.

అయితే, రీసెంట్ మూవీస్ కూడా మంచి మెసేజ్తో పాటు ప్రయోగాత్మకమైన కాన్సెప్ట్ తో వచ్చినవే. కానీ, ఆ సినిమాలకు మౌత్ టాక్ వచ్భిన బాక్సాపీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టలేకపోయాడు. అయినప్పటికీ వరుణ్ తన నుంచి రాబోయే సినిమాలు కూడా తనను తానుగా మలుచుకునే ప్రయోగాత్మకమైన కాన్సెప్ట్స్ తో వస్తుండటం విశేషం.

ప్రస్తుతం వరుణ్ తేజ్ పలాస మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన కరుణకుమార్ (Karuna Kumar)డైరెక్షన్ లో మట్కా అనే పీరియాడికల్ జోనర్ లో వస్తున్నాడు.1958-1982 మధ్య యావత్ దేశాన్ని కదిలించిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా మట్కా తెరకెక్కిస్తున్నారట.

ALSO READ | Kali Movie: ఆత్మహత్యలపై సందేశాత్మకంగా సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కలి: దర్శకుడు శివ శేషు

ఈ మూవీ నిర్మాణానంతర కార్యక్రమాలు కంప్లీట్ అవ్వడంతో మట్కా నిర్మాతలు రిలీజ్ డేట్ ప్రకటించారు. వైజాగ్ వీధుల నుండి పవర్ కారిడార్ల వరకు.. మట్కాతో గేమ్‌ని మార్చడానికి అడుగుపెడుతున్నాడు.. నవంబర్ 14న థియేటర్లలోగ్రాండ్ రిలీజ్ " అంటూ మెగా ప్రిన్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. 

రా అండ్ ర‌స్టిక్ గా వచ్చే ఈ సినిమాలో వరుణ్ నాలుగు డిఫరెంట్ షేడ్స్ లో కపిస్తున్నాడట. అలాగే ఈ సినిమాలో వరుణ్ కి జోడిగా ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నట్లు సమాచారం.కుర్రాళ్ల కలల రాణి అయిన యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary),కెనెడియన్ బ్యూటీ నోరా ఫతేహి హీరోయిన్స్ గా సెలెక్ట్ అయ్యారని తెలిసిందే.

వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించనున్న ఈ మూవీకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.