ప్రముఖ హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో వరుణ్ కి జంటగా బ్యూటిఫుల్ హీరోయిన్ మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఇక నవీన్ చంద్ర, నోరా ఫతేహి(బాలీవుడ్), మిమి గోపి, కిషోర్, రవిశంకర్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కరుణకుమార్ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఇటీవలే ఈ చిత్ర టీజర్ విడుదలైంది.
అయితే మట్కా ఆట బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో భాగంగా ఓ సాధారణ యువకుడు మట్కా ఆటని శాసించి సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు, ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడనే విషయాలను చూపిస్తూ ట్రైలర్ ని కట్ చేశారు. ఇక గతంతో పోలిస్తే ఈ చిత్రంలో వరుణ్ తేజ్ గెటప్ మరియు డైలాగ్ డెలివరీ పూర్తీగా భిన్నంగా ఉంది.
మాస్ మరియు క్లాస్ లుక్స్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఇక యాక్షన్ సీన్స్ కి తగ్గట్టుగా జివి ప్రకాష్ కుమార్ బీజిఎం అదరగొట్టాడు. దీన్నిబట్టి చూస్తే మట్కా చిత్రంతో వరుణ్ తేజ్ మంచి మ్యాసివ్ హిట్ అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని 14న విడుదల చెయ్యబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు.
ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్య వరుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రాలు బాక్సఫెస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో మట్కా చిత్రంతో హిట్ కొట్టాలని బాగానే శ్రమించాడు. మరి ఈ చిత్రం థియేటర్లో ఆడియన్స్ ని ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.