రిజల్ట్ ఎలా ఉన్నా తను మాత్రం డిఫరెంట్ స్ర్కిప్టులతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు వరుణ్ తేజ్. మరోసారి కొత్త తరహా కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించబోతున్నట్టు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నాయి.
ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు తెలియజేశారు. ఇండో కొరియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు తెలుస్తోంది. దీనికోసం వరుణ్ తేజ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. ఇందులో తను ఫ్రెష్ అండ్ యూనిక్ క్యారెక్టర్లో కనిపించనున్నాడని టీమ్ చెప్పింది. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.