కొత్త షెడ్యూల్‌‌‌‌‌‌‌‌కు రెడీ

కొత్త షెడ్యూల్‌‌‌‌‌‌‌‌కు రెడీ

వరుణ్ తేజ్ హీరోగా ‘పలాస’ ఫేమ్  కరుణ కుమార్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘మట్కా’. ఇప్పటికే కొంత భా గం షూటింగ్ పూర్తయింది.  తాజాగా కొత్త షెడ్యూ ల్‌‌‌‌‌‌‌‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. జూన్ 19 నుంచి ఈ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను మొదలుపెడుతున్నట్టు శుక్రవారం అప్‌‌‌‌‌‌‌‌డే ట్ ఇచ్చారు మేకర్స్. దీనికోసం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో  మ్యాసివ్ సెట్‌‌‌‌‌‌‌‌ను సిద్ధం చేస్తు న్నారట.

ఈ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌లో వరుణ్‌‌‌‌‌‌‌‌ తేజ్‌‌‌‌‌‌‌‌తో పాటు కీలక పాత్రలు పోషిస్తున్న నటీనటులు జాయిన్ కానున్నారు.ఇందులో  వరుణ్ తేజ్ నాలుగు డిఫరెంట్ గెటప్‌‌‌‌‌‌‌‌లలో కని పించనున్నాడు. దేశవ్యాప్తంగా అందరినీ కదిలించిన ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర, రవి శంకర్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్‌‌‌‌‌‌‌‌గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.