Operation Valentine OTT: ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు..ఎక్కడ?

Operation Valentine OTT:  ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు..ఎక్కడ?

ఎయిర్ ఫోర్స్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine). శక్తి ప్రతాప్ సింగ్ హడా (Shakthi Prathap Sing Hada) దర్శకుడు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ మూవీని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్దా నిర్మించింది.

2019 ఫిబ్రవరి 14 న పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన దాడి, ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ ఉగ్రవాదులపై తీర్చుకున్న రివెంజ్ నేపథ్యంలో ఈ సినిమా ఇవాళ (మార్చి1న) థియేటర్స్ కి వచ్చింది. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇంతవరకు టాలీవుడ్ లో ఇలాంటి సినిమా రావడం ఇదే ఫస్ట్ టైం. పుల్వామాలో ఘటనలో  జవాన్లతో ఉన్న సీన్స్ ఎమోషన్ పెంచుతోంది. అలాగే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీర్చుకున్న ప్రతీకారం గూస్బంప్స్ తెప్పిస్తుంది.

ప్రస్తుతం థియేటర్స్లో పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న ఆపరేషన్ వాలెంటైన్ డిజిటల్ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ దక్కించుకున్నట్లు సమాచారం.ఈ సినిమా రిలీజైన నాలుగు వారాల తర్వాత తెలుగు భాషలో అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో స్ట్రీమింగ్ కానుంది. అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఓటీటీలో అందుబాటులోకి రానుందన్నమాట.హిందీలో మాత్రం రిలీజైన రెండు నెలల తర్వాతనే ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. 

ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లోనే థియేటర్స్కి వచ్చిన ఆపరేషన్ వాలెంటైన్..ఓటీటీలో మాత్రం తెలుగు, హిందీతో పాటు కన్నడ, మలయాళం, తమిళ్ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.అయితే దీనిపై ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. త్వరలో మేకర్స్ నుంచి ఓటీటీ అఫిసియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.  

ALSO READ :- GHMC లో 37మంది అధికారుల తొలగింపు

ప్రసెంట్ ఆపరేషన్ వాలెంటైన్కు పోటీగా పెద్ద సినిమాలు లేకపోవడం..పుల్వామా అటాక్ నేపథ్యంతో రావడం..ప్లస్ పాయింట్ అనే టాక్ వినిపిస్తోంది. మరి  ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ఈ వీకెండ్ లో ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.