Varun Tej: సపోర్ట్ చేసిన వారిని మర్చిపోతే.. నీ సక్సెస్ ఎందుకు పనికిరాదు: వరుణ్ తేజ్ కామెంట్స్

Varun Tej: సపోర్ట్ చేసిన వారిని మర్చిపోతే.. నీ సక్సెస్ ఎందుకు పనికిరాదు: వరుణ్ తేజ్ కామెంట్స్

'లైఫ్లో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావ్.. నీ వెనుక సపోర్ట్ ఎవ్వరు? అనేది మర్చిపోతే నీ సక్సెస్ ఎందుకు పనికిరాదు?.. ఇపుడు ఈ మాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి, ఇంతకీ ఈ మాటలు ఎవరన్నారు అనుకుంటున్నారా? మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(VarunTej).. 

వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మట్కా (MATKA) మూవీ నవంబర్ 14న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో ఆదివారం నవంబర్ 10న వైజాగ్‌లో మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. "ఒకరన్నారు ఎప్పుడు మీవాళ్ల గురించే చెప్పడమేనా అని అనుకుంటున్నారు.. అంటూ గుర్తుచేసుకుంటూ.. 'వాళ్ల గురించి కచ్చితంగా మాట్లాడతాను. అది నా ఇష్టం." మా బాబాయ్, పెదనాన్న, నాన్న ఎప్పుడు గుండెల్లో ఉంటారు. వారి గురించి చెప్పాల్సిన పనిలేదు. వాళ్ల సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది.

అంటే, లైఫ్‌లో నువ్ పెద్దోడివి అవ్వొచ్చు అవ్వకపోవచ్చు గానీ.. ఎందుకు మొదలుపెట్టావ్. ఎక్కడి నుంచి మొదలుపెట్టావ్. ఎక్కడి నుంచి వచ్చావ్. నీ వెనకాల ఉండే సపోర్ట్‌ ఎవరు' ఇక వారి గురించి మర్చిపోతే నీ సక్సెస్ దేనికి పనికిరాదు" అంటూ వరుణ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరెవరినో ఉద్దేశించి అన్నాడనేది హాట్ టాపిక్ గా మారింది.

ఇక రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. "ప్రతి సినిమా రిలీజ్ ముందు ఒక టెన్షన్ ఉంటుంది. అలా టెన్షన్ పడుతున్నప్పుడు రామ్ చరణ్ అన్నయ్య నుంచి మొన్న మార్నింగ్ ఫోన్ వచ్చింది. అన్నయ్య ఎప్పుడు ఒక ఎమోషనల్ సపోర్ట్ గా ఉంటారరు. థాంక్స్ చరణ్ అన్న..  అంటూ వరుణ్ తేజ్ చాలా గర్వంగా ఫీల్ అవుతూ రామ్ చరణ్ గొప్పగా తెలిపాడు.