![మెగాప్రిన్స్ వరుణ్ తేజ్..పలాస డైరెక్టర్ కాంబో సెట్..కథేంటో తెలుసా?](https://static.v6velugu.com/uploads/2023/07/Varun-Tej-signs-a-big-budget-film-With-Palasa-Director_H2JZidOW35.jpg)
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ను ఎంచుకుంటూ ఇండస్ట్రీ లో రాణిస్తున్నారు. ప్రయోగాలు చేయడంలో ఈ మెగా హీరో ఎప్పుడు ముందుంటారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. పలాస మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన కరుణకుమార్(Karuna Kumar) డైరెక్షన్ లో వరుణ్ తేజ్ ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. రా అండ్ రస్టిక్ కంటెంట్ తో ఉన్న కథలో.. వరుణ్ రోల్ చాలా మాసివ్ గా ఉంటుందని సమాచారం.
ఈ మూవీ 1960 నేపథ్యంలో జరిగిన వాస్తవ సంఘటనలను బేస్ చేసుకొని ఈ మూవీని తెరకెక్కించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకుగాను 1960 గ్రామాల్లోని వాతావరణాన్ని క్రీయేట్ చేసేందుకు బెటర్ ఆర్ట్ టెక్నిషన్స్ ని రంగంలో దింపుతున్నారని తెలుస్తోంది. ప్రయోగాలు చేయటంలో వెనుకాడని వరుణ్ తేజ్.. సహజమైన డైరెక్షన్ తో ఆకట్టుకునే కరుణకుమార్ వీరిద్దరూ ఈ మూవీ కోసం భారీ సాహసం చేయబోతున్నారట. .
ఈ నెల జూలై 27న గ్రాండ్‌గా మూవీ లాంఛ్ కానుందని సమాచారం. హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) ఎంపిక కాగా..
వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ మూవీను నిర్మించనున్నారు. #VT14 వరుణ్ తేజ్ కెరీర్‌లో భారీ బడ్జెట్ చిత్రం కానుందని సమాచారం.
ప్రస్తుతం వరుణ్ తేజ్..ప్రవీణ్ సత్తారు ( Praveen Sattaru ) డైరెక్షన్ లో రూపొందుతున్న గాండీవధారి అర్జున ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.