‘గని’ ట్రైలర్ వచ్చేసింది

హైద‌రాబాద్‌: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న ‘గని’ మూవీ ట్రైలర్ రిలీజైంది. బాక్సర్ గా వరుణ్ తన పంచ్ లతో అలరిస్తున్నాడు. ‘గెలవడం తప్ప వేరే ఆప్షన్ లేదు’ అంటూ ట్రైలర్ లో వరుణ్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. యాక్షన్ సీన్స్‏ కూడా హైలెట్ అయ్యాయి. స్పోర్ట్స్ డ్రామా అయిన ఈ మూవీలో బాక్సర్ పాత్ర కోసం వరుణ్ తేజ్ తన శరీరాన్ని మార్చుకుని సిక్స్ ప్యాక్ లుక్ లో అదరగొడుతున్నాడు. ప్రొఫెషనల్ బాక్సర్ అయ్యేందుకు గని ఎంత కష్టపడ్డాడో చూడొచ్చు. వరుణ్ కు కోచింగ్ ఇచ్చే పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి నటించాడు. ఇతర పాత్రల్లో జగపతి బాబు, ఉపేంద్ర, నవీన్ చంద్ర యాక్ట్ చేశారు. హీరో పక్కన సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. సాయి కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు.. సూపర్ ఫామ్ లో ఉన్న తమన్ స్వరాలు సమకూర్చాడు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు, అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ మూవీని వచ్చే నెల 8న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 

ఇక ‘గని’ సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఎఫ్ 3లోనూ కూడా వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. ఎఫ్ 3లో వరుణ్‌కు జంటగా మెహ్రీన్ నటిస్తుండగా.. మరో జంటగా వెంకటేష్, తమన్నా యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. తొలి భాగంతో పోలిస్తే సీక్వెల్ మరింత కామెడీతో సాగుతుందట. 

మరిన్ని వార్తల కోసం:

స్వామీజీ ముసుగులో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం

45 రోజుల్లో ఏడంతస్తుల బిల్డింగ్ కట్టేసిన్రు

పెట్రోల్​ మస్తు కొంటున్రు