
డిఫరెంట్ స్ర్కిప్టులతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు వరుణ్ తేజ్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ నటించబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. సోమవారం పూజా కార్యక్రమాలతోపాటు రెగ్యులర్ షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్‌లోని టీమ్ సభ్యులు పాల్గొన్నారు. వరుణ్ తేజ్ కెరీర్‌లో ఇది15వ సినిమా.
ఇండో కొరియన్ హారర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీనికోసం వరుణ్ తేజ్ సరికొత్తగా మేకోవర్ అయ్యాడు. మార్షల్ ఆర్ట్స్‌లోనూ ట్రైనింగ్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. రితిక నాయక్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ హిలేరియస్ అడ్వంచరస్ మూవీకి సంబధించిన మరిన్ని అప్‌డేట్స్‌ని త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ చెప్పారు.