మెగా పవర్ స్టార్ వరుణ్ తేజ్ (Varun Tej) డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ను ఎంచుకుంటూ వస్తోన్న విజయానికి చాలా దూరంలో ఉంటున్నాడు. గత నాలుగు సినిమాలు గని, గాండీవదారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, లేటెస్ట్గా మట్కా ఇవన్నీ వరుణ్కు ఎలాంటి ప్రయోజనాన్ని ఇవ్వలేకపోయాయి.
బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టాలనే సంకల్పంతోనే ఈ ప్రాజెక్ట్స్ చేసిన సరైన హిట్ ఒక్కటే అంటే ఒక్కటి ఇవ్వలేదు. దాంతో వరుణ్ తేజ్ గ్రాఫ్ పడిపోతుందని.. వచ్చే సినిమాలలో రెమ్యునరేషన్ లో కోతలు తప్పవని టాక్ కూడా నడుస్తోంది.
అయితే, ఈ మెగా హీరో డిజాస్టర్స్ ఎన్నొచ్చిన రెమ్యునరేషన్ లో మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ఉన్నాడట. ప్రస్తుతం డైరెక్టర్ మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో వరుణ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కథ సగ భాగం కొరియాలో, మరొక భాగం రాయలసీమ నేపథ్యంలో కొనసాగనుందట.
యాక్షన్‌కి పెద్ద పీట వేసే ఈ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందనే టాక్ వినిపిస్తోంది. కొరియన్ నేపథ్యాన్ని కేంద్రంగా తీసుకుని గాంధీ కథను రూపొంధిస్తుండడం కొత్తగా అనిపించే విషయం అయినప్పటికీ తేడా కొడితే మాత్రం అంతే సంగతి.
ఇకపోతే ఈ సినిమాకు ‘కొరియా కనకరాజు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సినీ సర్కిల్లో టాక్. ఈ సినిమాకు గాను వరుణ్ తేజ్ మునుపటి తరహాలోనే రూ.7 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
అంతేకాకుండా.. వరుణ్ తేజ్ మరో కొత్త సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రి మేకర్స్ నిర్మిస్తుండగా.. రూ.7 కోట్ల రెమ్యునరేషన్ను వరుణ్ డిమాండ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
వరుస ఫెయిల్యూర్స్ పలకరించినప్పటికీ రెమ్యునరేషన్ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ఉందట. అయితే, వరుణ్ తేజ్ కటౌట్ కి సరైన ఒక్క కథ పడితే తిరుగుండదు. దాంతో 'కంచే' లాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ చేస్తే చూడాలని ఫ్యాన్స్ కోరిక. మరి సరైన కథ పడుతుందా.. లేదా అనేది మరికొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.