Operation Valentine: వ‌రుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్.. ఆకాశమంతటా భారతదేశ గర్జన

Operation Valentine: వ‌రుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్.. ఆకాశమంతటా భారతదేశ గర్జన

మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్(Varun Tej)  డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ను ఎంచుకుంటూ ఇండస్ట్రీ లో రాణిస్తున్నారు. ప్రయోగాలు చేయడంలో ఈ మెగా హీరో ఎప్పుడు ముందుంటారు. ఇక రీసెంట్ గా పలాస మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన కరుణకుమార్(Karuna Kumar)  డైరెక్షన్ లో వరుణ్ తేజ్ ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసేందే. లేటెస్ట్ గా వరుణ్ తేజ్ 13వ మూవీ నుంచి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine) టైటిల్ ని ఫిక్స్ చేయగా..ఈ మూవీలో IAF ఆఫీసర్ గా వరుణ్ కనిపిస్తోన్నట్లు తెలుస్తోంది.  

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో మూవీ వస్తోందని పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఎయిర్ ఫోర్స్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తెరకెక్కుతుందని ప్రకటించారు. వరుణ్ తేజ్ 13వ సినిమాగా వస్తోన్న ఈ మూవీకి కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్(Shakti Pratap Sing)  డైరెక్ట్ చేస్తున్నట్లు తెలిపారు. 

కాగా ఈ మూవీ స్టోరీ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో వస్తుండగా..ఆకాశమంతటా ప్రతిధ్వనిస్తున్న భారతదేశ గర్జనను వినండి. అంటూ వరుణ్ తేజ్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.ఇక పోస్టర్ లో వరుణ్ తేజ్..గంభీరమైన చూపులు,యుద్ధం మధ్యలో యోధుడిగా కనిపిస్తున్న పోస్టర్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇక ఈ మూవీ కోసం వరుణ్ తేజ్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నట్లు సమాచారం. 

వరుణ్ తేజ్ కు జోడీగా 2017 మిస్‌వరల్డ్ మానుషి చిల్లర్( Manushi Chhillar) నటిస్తుంది. ఈ మూవీ 2023 డిసెంబర్ 8న తెలుగు,హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్( Sony Pictures International Productions ), రినైసన్స్ పిక్చర్స్(Renaissance Pictures) సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.