కాకినాడ పోర్టులో మట్కా షూటింగ్

వరుణ్ తేజ్ హీరోగా ‘పలాస’ ఫేమ్  కరుణ కుమార్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘మట్కా’. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తయింది.  తాజాగా కొత్త షెడ్యూల్‌‌ను కాకినాడలో స్టార్ట్ చేశారు. ఈ షెడ్యూల్‌‌లో  టాకీ పార్ట్‌‌తో పాటు  యాక్షన్ పార్ట్‌‌ను చిత్రీకరిస్తున్నట్టు తెలియజేశారు  మేకర్స్. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌లో  చేతిలో గన్ పట్టుకుని  కాకినాడ పోర్ట్‌‌లో   భారీ క్రూయిజ్ షిప్ ముందు నిలబడి కనిపిస్తున్న వరుణ్ తేజ్ బ్యాక్ పోస్టర్ ఇంప్రెస్ చేస్తోంది.  

వరుణ్‌‌ తేజ్‌‌తో పాటు కీలక పాత్రధారులు ఈ షెడ్యూల్‌‌లో  జాయిన్ అయ్యారు. ఇందులో  వరుణ్ తేజ్ నాలుగు డిఫరెంట్ గెటప్‌‌లలో కనిపించనున్నాడు. దేశవ్యాప్తంగా అందరినీ కదిలించిన ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర, రవి శంకర్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్‌‌గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.