
చైత్రమాసంలో వసంత నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. అష్టమి.. నవమి ( 8,9 ) రోజుల్లో కన్యాపూజ జరుగుతుంది. అయితే ఈ పూజ సయమంలో అమ్మవారికి ఏఏ వస్తువులు సమర్పించాలో తెలుసుకుందాం.
తెలుగువారి కొత్త సంవత్సరం సందర్భంగా వసంతనవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు జరుగుతాయి. ఈఉత్సవాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. అష్టమి.. లేదా .. నవమి రోజున అనగా 8 లేదా 9 వ రోజున కన్యపూజ చేసి ఉత్సవాలను ముగిస్తారు. కన్య పిల్లలను ( ఆడపిల్లలను ) సాక్షాత్తు దుర్గాదేవిగా భావించి.. పూజలు చేసి.. ప్రసాదం తినిపించడం వారికి కొన్ని బహుమతులు కూడా ఇవ్వడం ఆచారంగా ఉండేది. అయితే కొంతమంది తెలిసీ.. తెలియక ఇవ్వకూడని వస్తువులు కూడా ఇస్తారు. వసంత నవరాత్రి ఉత్సవాల్లో కన్యపూజ రోజు అమ్మాయిలకు ఎలాంటి బహమతులు ఇవ్వాలి.. ఎలాంటివి ఇవ్వకూడదో తెలుసుకుందాం. .
ఇవ్వాల్సిన బహుమతులు: నవరాత్రిలో కన్యాపూజ సమయంలో.. మీ ఇంటికి వచ్చే అమ్మాయిలకు కొత్త బట్టలు, ఎర్రటి చునారి, స్వీట్లు, పండ్లు, గాజులు, హెయిర్ క్లిప్‌లు, పెన్సిళ్లు, పెన్నులు, పుస్తకాలు మొదలైన వాటిని బహుమతిగా ఇవ్వాలి. నవరాత్రిఉత్సవాల్లో దేవతా పూజ సమయంలో సాత్వికాన్ని పాటించండి.
ఇవ్వకూడనివి:
- తోలుతో చేసిన వస్తువులు ఇవ్వకూడదు ( లెదర్ బ్యాగ్స్, పర్సు, బెల్ట్ .. బూట్లు వంటి తోలుతో చేసిన ఏదైనా ఇవ్వకండి.).. తోలు వస్తువులు జంతువులు హింసించి తయారు చేస్తారు.
- నలుపు రంగు వస్తువులను బహుమతిగా ఇవ్వకండి. నలుపు రంగు అశుభాన్ని సూచిస్తుంది. పూజ సమయంలో నల్ల బట్టలు.. నల్ల గాజులు.. నల్ల రంగుతో ఉన్న ఏ వస్తువులు కూడా బహుమతిగా ఇవ్వవద్దు.
- పదునైన వస్తువులు.. కన్యా పూజ సమయంలో కత్తి, కత్తెర , సూది వంటి పదునైన వస్తువులు ఎప్పుడూ బహుమతిగా ఇవ్వకండి.
- ఉపయోగించిన వస్తువులు : కన్యా పూజ సమయంలో పాత వస్తువులు. .. అరిగిపోయిన వస్తువులను ఎప్పుడూ బహుమతిగా ఇవ్వకండి. ఎందుకంటే అది అగౌరవంగా పరిగణించబడుతుంది. ఎల్లప్పుడూ కొత్త వస్తువులను బహుమతులుగా కొని ప్రేమతో, భక్తితో ఇవ్వండి.
►ALSO READ | Sriramanavami 2025: శ్రీరామనవమి రోజున పాటించాల్సిన నియమాలు ఇవే..!