వెలుగు, పద్మారావునగర్/ఫొటోగ్రాఫర్స్ : వసంతపంచమి సందర్భంగా సిటీలోని సరస్వతీదేవి ఆలయాలు సోమవారం భక్తులతో కిక్కిరిశాయి. తల్లిదండ్రులు తమ పిల్లలతో అక్షరాభ్యాసం చేయించారు. వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. పలు ఆలయాల్లో సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. శ్రీసరస్వతీ హోమం, సర్వపూజ, పంచామృతాభిషేకం, వాహన సేవలు జరిగాయి.