Vasanta Panchami 2025: చదువుల తల్లి పండుగ..సరస్వతి దేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి..

Vasanta Panchami 2025:  చదువుల తల్లి పండుగ..సరస్వతి దేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి..

మాఘమాసం కొనసాగుతుంది.  చదువుల తల్లి .. సరస్వతిదేవి పుట్టిన రోజు మాఘమాసం శుద్ద పంచమి.  దీనినే వసంత పంచమి.. శ్రీ పంచమి అంటారు.  క్రోధినామ సంవత్సరంలో  ఫిబ్రవరి 3 వ తేదీన  దేశ వ్యాప్తంగా వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. పండితులు.. సిద్దాంతులు తెలిసిన వివరాల ప్రకారంచదువుకునే పిల్లలు   ఈ రోజున ( ఫిబ్రవరి 3) కొన్ని ప్రత్యేక నియమాలు పాటిస్తే చదువులో రాణిస్తారని చెబుతున్నారు. వసంత పంచమి రోజు పిల్లలు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం. . .

చదువుకునే పిల్లలకు వసంత పంచమి చాలా ప్రత్యేకమైన రోజు.  ఆ రోజు ( ఫిబ్రవరి 3)  చదవుల తల్లి.. సరస్వతి దేవిని పూజించడం వలన విద్యార్థులు విద్యలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఙ్ఞానాన్ని సంపాదించడమే కాకుండా.. కొత్త ఆలోచనలు రావడం.. పాఠశాలలో... పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. 

వసంత పంచమి రోజున  చిన్న పిల్లలు తమ విద్యా జీవితం ప్రారంభిస్తారు.  అంటే ముహూర్తంతో సంబంధం లేకుండా అక్షరాభ్యాసం చేస్తారు.  అందుకే ఈ ఏడాది ఫిబ్రవరి 3న సరస్వతి దేవాలయాలు కిటకిటలాడుతాయి. 

ALSO READ | ఎలక్ట్రిక్​ బేబీ నెయిల్​ కట్టర్.. చిన్నపిల్లల గోర్లను ఈజీగా కట్ చేయొచ్చు

వసంతపంచమి ( ఫిబ్రవరి 3) రోజున విద్యార్థులు సరస్వతి దేవిని పూజించాలి.  అవకాశం ఉన్నవారు.. ఉండగలిగిన వారు ఉపవాస దీక్షను పాటిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. ముందుగా బ్రహ్మ ముహూర్తంలో లేచి కాలకృత్యాలు తీర్చుకొని.. పూజా మందిరంలో సరస్వతి దేవి విగ్రహాన్ని కాని.. చిత్ర పటాన్ని కాని ఉంచాలి.  ఆ తరువాత షోడశోపచారాల పూజలు చేసి.. సరస్వతి అష్టోత్తరం తో అమ్మవారిని పూజించి  ధూపం.. దీపం.. దీపం .. నైవేద్యం సమర్పించాలరు.  ఇలా చేస్తే పిల్లలకు విద్యా పరంగా ఎంతో శుభప్రదమని చెబుతున్నారు. అలా చేస్తే.. వారి జ్ఞానాభివృద్ధి సులభం అవుతుంది. పాఠశాలల్లో.. కాంపిటేటివ్​ ఎగ్జామ్స్​ లో మంచి ఫలితాలు పొంది.. జీవితంలో విజయం సాధించడం ఖాయమని పండితులు చెబుతున్నారు. 

సరస్వతి దేవత   జ్ఞానం, కళ, సంగీతం,  విద్య.. విజ్ఞానానికి అదిష్ఠాన దేవత.  ఆమె పుట్టిన రోజున అనగా వసంత పంచమి రోజున ఈ దేవతను ప్రత్యేకతంగా పూజలు చేస్తారు.  అలా చేయడం వలన విద్యార్థులకు చదువులో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.  విద్యార్థులకు మంచిగా చదివేందుకు  ప్రేరణ ఇవ్వడానికి సరస్వతి దేవతను పూజించడం ద్వారా వారు నూతన ఆశలు, శక్తిని పొందుతారు.ఈ రోజున( ఫిబ్రవరి 3)  సరస్వతి దేవిని పూజించి ...ఉపవాసం ఉండడం వల్ల విద్యార్థుల జీవితాల్లో ఆనందం, విజయం, ఆధ్యాత్మిక శ్రేయస్సు ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు